Corona: క‌ర్ణాట‌క‌లో క‌రాళ నృత్యం చేస్తోన్న క‌రోనా.. గురువారం ఒక్క రోజే 35వేల‌కుపైగా కేసులు.. 344 మంది మృతి..

| Edited By: Subhash Goud

May 13, 2021 | 10:50 PM

Corona In Karnataka: దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ క‌రాళ నృత్యం చేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కేసులు సంఖ్య విప‌రితంగా పెరిగిపోతున్నాయి వేల సంఖ్య‌లో కేసులు, వంద‌ల సంఖ్య‌లో...

Corona: క‌ర్ణాట‌క‌లో క‌రాళ నృత్యం చేస్తోన్న క‌రోనా.. గురువారం ఒక్క రోజే 35వేల‌కుపైగా కేసులు.. 344 మంది మృతి..
Coronavirus
Follow us on

Corona In Karnataka: దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ క‌రాళ నృత్యం చేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కేసులు సంఖ్య విప‌రితంగా పెరిగిపోతున్నాయి వేల సంఖ్య‌లో కేసులు, వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాల‌తో భ‌యాన‌క ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇక తాజాగా క‌ర్ణాట‌క‌లో కోవిడ్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. మ‌ర‌ణాలు కూడా భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.
గురువారం (మే13) ఒక్క‌రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 35,297 కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా 24 గంట‌ల్లో క‌రోనా బారిన ప‌డి 344 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి రాష్ట్రంలో మొత్తం 20,88,488 కేసులు న‌మోదుకాగా 20,712 మంది మ‌ర‌ణించారు.
ఇక గురువారం 34,057 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఒక్క రోజులో న‌మోదైన మొత్తం 35,297 కేసుల్లో ఒక్క బెంగ‌ళూరులోనే 15,191 కేసులు న‌మోదు కావ‌డం గ‌మనార్హం. ఇక క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం 5,93,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ రేట్ 27.64 గా ఉంది. ఇక గురువారం మ‌ర‌ణించిన 344 మందిలో 161 మంది బెంగ‌ళూరుకు చెందిన వారు కాగా.. మైసూరులో 15 మంది, ఉత్త‌ర కన్న‌డ‌లో 14 మంది బెంగ‌ళూరు రూర‌ల్‌లో 13 మంది, మ‌ద్య, తుమ‌కురులో 11 మంది హ‌స్స‌న్‌, శివ‌మొగ్గ‌లో 10 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్ణాట‌క‌లో మొత్తం 2,75,21,028 మందికి ప‌రీక్ష నిర్వ‌హించ‌గా.. గురువారం ఒక్క రోజే 1,27,668 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,693 కరోనా కేసులు.. 33 మంది మృతి..

Corona Vaccine for Children: కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..

కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు.. తర్వాత ఈ ఆహార నియమాలు పాటించాలి..! అప్పుడే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు..