దేశానికి పట్టిన అతిపెద్ద కరోనా.. ఆ పార్టీనే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

కరోనాపై రాజకీయాలు చేయోద్దని.. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. కొందరు దీనిపై రాజకీయ లబ్ధికోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. అయినా అలాంటి వారిని ప్రజలే పట్టించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్‌పై శాసనసభలో స్వల్పకాలిక చర్చ […]

దేశానికి పట్టిన అతిపెద్ద కరోనా.. ఆ పార్టీనే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2020 | 1:19 PM

కరోనాపై రాజకీయాలు చేయోద్దని.. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. కొందరు దీనిపై రాజకీయ లబ్ధికోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. అయినా అలాంటి వారిని ప్రజలే పట్టించుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్‌పై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ.. కరోనా వంటి సున్నిత అంశాలను రాజకీయం చేయొద్దని హితవు చెప్పారు. ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దు అన్నారు. దేశానికి పట్టిన అతిపెద్ద కరోనా వైరస్.. కాంగ్రెస్ పార్టీ అని.. దానిని దేశం నుంచి తరమాల్సిందేనన్నారు. ఇప్పటికే దేశంలో ఆ పార్టీపని దాదాపు అయిపోయిందన్నారు.

కరోనా వైరస్ ప్రభావం మనదేశంలో లేదని.. కానీ విదేశాల నుంచి వచ్చిన వారితోనే దేశంలోకి ప్రవేశించిందన్నారు. దేశంలో 65 మందికి రాగా.. వారిలో ఇద్దరు మాత్రం చనిపోయారన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని కరోనా లక్షణాలు ఉన్నాయో లేదనని గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. ఎయిర్ పోర్టులో 200 మంది సిబ్బంది నిత్యం అందుబాటులో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు ఎవరు కూడా కరోనా భయం పెట్టుకోవద్దని.. ఇవాళ సాయంత్రం కరోనాపై చర్చించేందుకు కేబినెట్ భేటీ కానుందని.. సమావేశం అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తెల్పుతామన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో.. స్కూళ్లు, సినిమా హాళ్లు మూసివేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా ఎంటర్ కాకుండా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే అయిదు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌.

వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో