కరోనా ‘ఖతమైందా?’, చైనాలో ఇక బీర్ ఫెస్టివల్

చైనాలో ఏటా జరిగే బీర్ ఫెస్టివల్ ఈ నెల 1 న ప్రారంభమైంది. వేల మంది చైనీయులు కరోనా భయాన్ని, ఫేస్ మాస్కులను వదిలేసి బీర్ రుచి కోసం..

కరోనా 'ఖతమైందా?', చైనాలో ఇక బీర్ ఫెస్టివల్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 7:10 PM

చైనాలో ఏటా జరిగే బీర్ ఫెస్టివల్ ఈ నెల 1 న ప్రారంభమైంది. వేల మంది చైనీయులు కరోనా భయాన్ని, ఫేస్ మాస్కులను వదిలేసి బీర్ రుచి కోసం తహతహలాడుతున్నారు. ‘కింగ్ డావో ‘ పేరిట ఈ ‘బీరోత్సవం’ ఈ నెలాఖరు వరకు జరుగుతుందట. సుమారు 1500 రకాల బీర్ రుచులను ఆస్వాదించే చైనీయులు తాగుతూ, తింటూ షో లు చూస్తూ ఎంజాయ్ చేయడమే పనిగాపెట్టుకోనున్నారు. కేవలం ఒక్క సాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోనే వందలాది స్థానికులు పొడవాటి టేబుల్స్ ముందు కూర్చుని ‘బీరు పానం’ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చైనాలో అసలు కరోనా వైరస్ ‘ఖత’మైనట్టే ఉందని విదేశీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

తన దేశంలో కరోనా వైరస్ ని చాలావరకు నియంత్రించుకున్న చైనా.. ఇక వినోద కార్యక్రమాల పైనా దృష్టి పెట్టింది. అయితే రష్యా నుంచి వచ్చే తమ దేశీయులే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ఇంపోర్టెడ్ కేసులతో తల్లడిల్లుతోంది.