జ‌గ్గ‌య్య‌పేట‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌!

జ‌గ్గ‌య్య‌పేట‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి విప‌రీతంగా పెరిగిపోతుంది. రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో పూర్థిస్తాయి లాక్‌డౌన్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 03, 2020 | 8:41 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి విప‌రీతంగా పెరిగిపోతుంది. రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో పూర్థిస్తాయి లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నెల‌ 5వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపారు. అయితే లాక్‌డౌన్ స‌మ‌యంలో నిత్యావ‌స‌రాల‌కు 4 గంట‌లు మాత్ర‌మే స‌మ‌యం ఇచ్చారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే సరుకులు తెచ్చుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఉంటుంది. అనంత‌రం షాపులు తెరిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు పేర్కొన్నారు.

కాగా ప్ర‌స్తుతం ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 45,516 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 7,822 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కి చేరుకుంది. వీటిల్లో 76,377 యాక్టివ్ కేసులు ఉండగా.. 88, 672 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1537 మంది మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 5,786 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది వైరస్ కరణంగా మరణించారు. అటు జిల్లాల వారీగా నమోదైన కేసులు చూస్తే.. అనంతపురం 953, చిత్తూరు 240, తూర్పుగోదావరి 1113, గుంటూరు 573, కడప 576, కృష్ణ 240, కర్నూలు 602, నెల్లూరు 500, ప్రకాశం 364, శ్రీకాకుళం 495, విశాఖపట్నం 1049, విజయనగరం 677, పశ్చిమ గోదావరిలో 440 కేసులు నమోదయ్యాయి.

Read More:

రాఖీ పండుగః మ‌హిళ‌ల‌ కోసం సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక కానుక

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

క్రేజీ కాంబోః అన్నగా విష్ణు, చెల్లిగా కాజ‌ల్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu