AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నిందలొద్దు.. కలిసి పోరాడుదాం’.. ట్రంప్ కు ‘జీ’ కౌంటర్ !

భయంకర కరోనా వైరస్ పై తమ రెండు దేశాలూ కలిసికట్టుగా పోరాడాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కు ఘాటైన రిప్లయ్ ఇచ్చారు.    కరోనా అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తాను జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడుతానని ట్రంప్ గురువారం మీడియాకు తెలిపారు. అన్నట్టే వీరి మధ్య జరిగిన సంభాషణలో.. జిన్ పింగ్ తామేమీ తీసిపోమన్నట్టు మాట్లాడారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్నంతా మనం షేర్ చేసుకుందాం.. […]

'నిందలొద్దు.. కలిసి పోరాడుదాం'.. ట్రంప్ కు 'జీ' కౌంటర్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 2:43 PM

Share

భయంకర కరోనా వైరస్ పై తమ రెండు దేశాలూ కలిసికట్టుగా పోరాడాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్.. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ కు ఘాటైన రిప్లయ్ ఇచ్చారు.    కరోనా అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తాను జిన్ పింగ్ తో ఫోన్ లో మాట్లాడుతానని ట్రంప్ గురువారం మీడియాకు తెలిపారు. అన్నట్టే వీరి మధ్య జరిగిన సంభాషణలో.. జిన్ పింగ్ తామేమీ తీసిపోమన్నట్టు మాట్లాడారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్నంతా మనం షేర్ చేసుకుందాం.. మన రెండు దేశాల మధ్య సంబంధాలు క్రిటికల్ స్టేజిలో ఉన్నాయి.. అందువల్ల అన్ని అంశాల్లో సహకరించుకోవడం తప్ప మరో మార్గం లేదు అని పింగ్ వ్యాఖ్యానించారు. కనీసం ఇప్పటినుంచయినా సంబంధాల మెరుగుదలకు అమెరికా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని, కరోనాను తరిమికొట్టేందుకు మనం మరింతగా సహకరించుకుందామని ఆయన అన్నారు. మా దేశంలోని కొన్ని రాష్ట్రాలు, నగరాలు, కంపెనీలు మీ దేశానికి మెడికల్ ఈక్విప్ మెంట్ ని సప్లయ్ చేశాయని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని జిన్ పింగ్.. ట్రంప్ ను కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ట్రంప్, విదేశాంగ మంత్రి పాంపియో.. ఇద్దరూ చైనా వైరస్ అని, వూహాన్ వైరస్ అని చైనాను అదేపనిగా తిట్టిపోసిన సంగతి విదితమే.. అందువల్లే జీ జిన్ పింగ్.. ట్రంప్ తో కఠినంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.

కార్మికురాలికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
కార్మికురాలికి రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..
బంగారం, వజ్రం కంటే ఖరీదైన లోహం..గ్రాము ధర 200 కిలోల గోల్డ్‌ సమానం
బంగారం, వజ్రం కంటే ఖరీదైన లోహం..గ్రాము ధర 200 కిలోల గోల్డ్‌ సమానం
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రిలీఫ్.. ఛార్జీలపై రూల్స్
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రిలీఫ్.. ఛార్జీలపై రూల్స్
శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలానికి సంక్రాంతి శోభ.. 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
బాస్ రప్ఫాడించారు.. 'మన శంకరవరప్రసాద్ గారు' చూసిన టాలీవుడ్ హీరో
బాస్ రప్ఫాడించారు.. 'మన శంకరవరప్రసాద్ గారు' చూసిన టాలీవుడ్ హీరో
కలియుగ వైకుంఠం.. అక్కడ ఆకలికి చోటు లేదు..
కలియుగ వైకుంఠం.. అక్కడ ఆకలికి చోటు లేదు..
రమ్యకృష్ణ కొడుకును చూశారా.. ? ఇంటర్వ్యూలో ఎంత ఫన్నీగా ఉన్నాడంటే..
రమ్యకృష్ణ కొడుకును చూశారా.. ? ఇంటర్వ్యూలో ఎంత ఫన్నీగా ఉన్నాడంటే..
లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో..? అధికారి ఒడ్డున కూర్చొని..
లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో..? అధికారి ఒడ్డున కూర్చొని..
టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు
టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు
సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట
సంతోషానికి వయసుతో పనిలేదు.. తొలిసారి సముద్రాన్ని చూసిన వృద్ధ జంట