AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపటి నుంచి దేశీయ విమానాలు.. రాష్ట్రాల అభ్యంతరాలు

దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి మళ్ళీ దేశీయ విమానాలు ఎగరనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాటు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగానూ...

రేపటి నుంచి దేశీయ విమానాలు.. రాష్ట్రాల అభ్యంతరాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: May 24, 2020 | 10:49 AM

Share

దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి మళ్ళీ దేశీయ విమానాలు ఎగరనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాటు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగానూ, అసలు ఇందుకు సంసిధ్దంగా లేమని ఆయా ప్రభుత్వాలు సూచనలు ఇవ్వడంతోను.. విమానాల పునరుధ్ధరణపై అయోమయం నెలకొంది.  మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు. కేంద్రం ప్రతిపాదనను సున్నితంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రంలో  కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని, లాక్ డౌన్ నిబంధనలను తాము సవరించలేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రజారవాణాపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని గుర్తు చేసింది. రెడ్ జోన్ లోని విమానాశ్రయాల్లో విమానాలను పునరుధ్దరించడం ఏమాత్రం సహేతుకం కాదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోలు, బస్సులు, క్యాబ్ లను అనుమతించడం సాధ్యం కాదని ఆయన  పేర్కొన్నారు.

తమిళనాడు కూడా దాదాపు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోయంబేడు వంటి కరోనా కేసులను ప్రస్తావిస్తూ.. రోజూ అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, అందువల్ల  కేంద్రం తన యోచనను వాయిదా వేసుకోవాలని, లేదా మళ్ళీ పరిశీలించాలని అభ్యర్థించింది. ఇక పశ్చిమ బెంగాల్.. ఇటీవల ఉమ్ ఫున్ తుఫాను తమ రాష్టాన్ని ఎలా కకావికలం చేసిందీ వివరించింది. కోల్ కతా విమానాశ్రయంలో విమానాలు దిగే..లేదా ప్రారంభించే పరిస్థితి లేదని పేర్కొంది. కనీసం ఈ నెల 30 వరకు పౌర విమాన యాన శాఖ తన ప్రతిపాదనను వాయిదా వేసుకోవాలని అభ్యర్థించింది.  ప్రయాణికులు విమానాల నుంచి దిగినప్పటికీ వారిని వారి ఇళ్లకు చేర్చేందుకు ప్రజా రవాణా లేని విషయాన్ని పలు రాష్ట్రాలు పదేపదే ప్రస్తావించాయి. అయితే పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి మాత్రం.. ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులను తాము పరిగణనలోకి తీసుకున్నామని, కానీ కేంద్రానికీ కొంత బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా.. ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా , ఎయిర్ ఏషియా ఇండియా వంటి ఎయిర్ లైన్స్ సోమవారం నుంచి తమ విమానాల పునరుధ్ధరణ నేపథ్యంలో టికెట్ల బుకింగ్స్ ను తీసుకోవడం ప్రారంభించాయి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!