నకిలీ శానిటైజర్ల దందా గుట్టు రట్టు.. లక్షల్లో సరుకు స్వాధీనం..
కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ లో ఉండటం.. శానిటైజర్లు, మాస్కులు వాడటం.. తప్పనిసరి. దీంతో శానిటైజర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు

Fake sanitizers disinfectants: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ లో ఉండటం.. శానిటైజర్లు, మాస్కులు వాడటం.. తప్పనిసరి. దీంతో శానిటైజర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ముఠాలు నకిలీ శానిటైజర్లు తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. క్వాలిటీ లేని కెమికల్ కంపోనెంట్లను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైలో లక్షల విలువ చేసే నకిలీ శానిటైజర్లు ,క్రిమి సంహారకాలు భారీగా పట్టుబడ్డాయి. చెన్నైలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపధ్యంలో శానిటైజర్లు ,క్రిమి సంహారకాలకు కొరత ఏర్పడింది.

ఇదే అదనుగా రంగంలోకి దిగిన నకిలీ ముఠా, మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన శానిటైజర్లు ,క్రిమి సంహారకాలకు నకిలీ వస్తువులు తయారీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చెన్నైలోని పలు ప్రాంతాలలో గత మూడు నెలలుగా భారీగా అమ్మకాలు జరిగాయి. పక్కా సమాచారంతో తనిఖీలు చేప్పట్టిన పోలీసులకు గోడౌన్ లో లక్షలు విలువ చేసి నకిలీ శానిటైజర్లు ,క్రిమి సంహారకాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గుజరాత్ కి చెందిన యజమాని పరారీలో ఉన్నాడు.

Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!