లాక్ డౌన్ పై ఏం చేద్దాం? పొడిగించే యోచనలో కేంద్రం !

ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా సర్కార్ యోచిస్తోందని వెల్లడించాయి. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజలు సుదీర్ఘ పోరాటానికి సిధ్ధంగా ఉండాలని ప్రధాని మోదీ

లాక్ డౌన్ పై ఏం చేద్దాం? పొడిగించే యోచనలో కేంద్రం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 5:00 PM

ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా సర్కార్ యోచిస్తోందని వెల్లడించాయి. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజలు సుదీర్ఘ పోరాటానికి సిధ్ధంగా ఉండాలని ప్రధాని మోదీ కోరిన విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేశాయి. లాక్ డౌన్ పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరగా.. దీన్ని దశలవారీగా ఎత్తి వేయాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారి ఒకరు.. లాక్ డౌన్ పొడిగించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆంక్లలు ఎత్తివేశాక ఏ ఒక్క కరోనా కేసు బయటపడినా పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందన్నారు. అయితే ఇంకా వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తెలుసుకుంటోంది. వచ్ఛే వారం అతి కీలకమైనదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసిన అంశం.

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!