స‌డ‌లింపుల‌పై కేంద్రం నిఘానేత్రం..!..మే 17 లోపు మ‌రో ప్ర‌క‌ట‌న ?

స‌డ‌లింపుల‌పై కేంద్రం నిఘానేత్రం..!..మే 17 లోపు మ‌రో ప్ర‌క‌ట‌న ?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న లాకడౌన్‌ సడలింపులపై కేంద్రం ఆరా తీస్తోంది. దీంతో నెలాఖరు 17కల్లా పొడగింపుపై మరో ప్రకటన రావచ్చని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Jyothi Gadda

|

May 05, 2020 | 3:09 PM

దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న లాకడౌన్‌ సడలింపులపై కేంద్రం ఆరా తీస్తోంది. సోమవారం నుంచి వివిధ రాష్ట్రాల్లో మద్యం దుకాణాలతో పాటు, పలు వర్కింగ్‌ క్లాసులకు అనుమతి  ఇచ్చారు. చాలాచోట్ల ప్రజలు ఇళ్లనుంచి బయటకు తోసుకుని వచ్చారు. అనేక ప్రాంతాల్లో రద్దీ కనిపించింది. ఇకపోతే మద్యం దుకాణాల ముందయితే మందుబాబులు కిలోమీట‌ర్ల‌ మేర క్యూలు కట్టారు. ఈ దశలో కరోనా వ్యాప్తి తీవ్రం అవుతుందన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై వివిద వర్గాల ద్వారా కేంద్రం సమాచారం తెప్పించుకుంటున్నదని విశ్వ‌స‌నీయ స‌మాచారం.  దీని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా లాకడౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
మే 17వ తేదీతో ముగియనున్న లాకడౌన్‌ను మరికొన్ని సడలింపులతో మరో 2 వారాల పాటు కొనసాగించడానికే ప్రధాని వెూదీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మద్యం అమ్మకాలకు వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో సోమవారం నుంచి అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై పీఎంవో నిఘా వర్గాల ద్వారా ఆరా తీసింది. వెూదీ పీఎంవో ఉన్నతాధికారులతో సమీక్ష‌ నిర్వహించింది. లాకడౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు సమీక్ష‌లో అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఇక‌పోతే, కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం… కేంద్ర ప్రజారోగ్య బృందాల్ని పంపిన సంగ‌తి తెలిసిందే. దేశంలో 20 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయా జిల్లాలకు కేంద్రం ప్రత్యేక ఆరోగ్య బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఈ బృందాలు ఆయా జిల్లాల్లోని అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులో రంజాన్‌ ఉన్నందున‌ సడలింపు ఇస్తే ప్రమాదమని పలువురు సూచిస్తున్నారు. దీంతో నెలాఖరుకు 17కల్లా పొడగింపుపై మరో ప్రకటన రావచ్చని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu