AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ వెర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్: డిసెంబర్ 3న తొలి టెస్టు..?

ఈ ఏడాది చివరన భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా.. కరోనా వైరస్ వల్ల ఆ సిరీస్ ఉంటుందా.? లేదా.? అనే సందిగ్ధం ఏర్పడింది. అయితే తాజాగా డిసెంబర్ లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్ 3వ తేదీన ఇరు జట్ల మధ్య తోలి టెస్ట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం BCCI వర్గాల ద్వారా తెలిసినట్లు.. డిసెంబర్ షెడ్యూల్‌కు రెండు బోర్డులు అంగీకరించినట్లు […]

భారత్ వెర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్: డిసెంబర్ 3న తొలి టెస్టు..?
Ravi Kiran
|

Updated on: May 28, 2020 | 8:56 AM

Share

ఈ ఏడాది చివరన భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా.. కరోనా వైరస్ వల్ల ఆ సిరీస్ ఉంటుందా.? లేదా.? అనే సందిగ్ధం ఏర్పడింది. అయితే తాజాగా డిసెంబర్ లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్ 3వ తేదీన ఇరు జట్ల మధ్య తోలి టెస్ట్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం BCCI వర్గాల ద్వారా తెలిసినట్లు.. డిసెంబర్ షెడ్యూల్‌కు రెండు బోర్డులు అంగీకరించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండటంతో BCCI ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీలలో ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, భారత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లగానే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!