కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్… డిశ్చార్జ్…

కరోనా వ్యాధి నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజులపాటు ఆయన డౌనింగ్ స్ట్రీట్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్...  డిశ్చార్జ్...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 12, 2020 | 7:09 PM

కరోనా వ్యాధి నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజులపాటు ఆయన డౌనింగ్ స్ట్రీట్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూడు రోజులు ఐసీయులో ఉన్నారు. ఇక ఆయన చెకర్స్ ప్రాంతంలో మరికొంతకాలం పాటువిశ్రాంతి తీసుకుంటారని.. ఆయన ఆరోగ్యాన్ని డాక్టర్లు పరీక్షిస్తుంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పట్లో ఆయన ప్రధానిగా బాధ్యతలను చేపట్టబోరు. విదేశాంగ మంత్రి డోమెనిక్ రాబ్ మరికొంతకాలం తాత్కాలికంగా ప్రధాని బాధ్యతలను వహిస్తారని తెలిసింది. జాన్సన్ డిశ్చార్జ్ అయ్యారని తెలియగానే ఆయన భాగస్వామి కేరీ సైమండ్స్.. ఆసుపత్రి స్టాఫ్ కు కృతఙ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈస్టర్ తమ కుటుంబానికి శభం చేకూర్చిందని జాన్సన్ ఫ్యామిలీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.