బిహార్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

బిహార్‌లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఓ వైపు భారీ వర్షంతో పిడుగులు పడుతుంటే.. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో..

బిహార్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2020 | 6:35 PM

బిహార్‌లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఓ వైపు భారీ వర్షంతో పిడుగులు పడుతుంటే.. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పద్నాలుగు వేలకు చేరువయ్యాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,978కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 9,541 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని బిహార్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజు ఇరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండున్నర లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మరో నాలుగున్నర లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.