గల్ఫ్ దేశాల్లోని కార్మికులని స్వదేశానికి రప్పించాలి-బండి సంజయ్
లాక్‌డౌన్ కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వలస కార్మికులను స్వరాష్ట్రానికి రప్పించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు ఆయన లేఖ రాశారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 10లక్షల మంది తెలంగాణ వాసులు ఉన్నారని… వారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారంతా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారని… లాక్‌డౌన్ కారణంగా అర్ధాకలితో అలమటిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. […]

లాక్‌డౌన్ కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వలస కార్మికులను స్వరాష్ట్రానికి రప్పించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు ఆయన లేఖ రాశారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 10లక్షల మంది తెలంగాణ వాసులు ఉన్నారని… వారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారంతా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారని… లాక్‌డౌన్ కారణంగా అర్ధాకలితో అలమటిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు బండి సంజయ్.




