బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అన్‌లాక్ దశలో విచ్చలవిడిగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకినట్లుగా సమాచారం.
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు శర వేగంగా పెరుగుతోంది.. లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో తక్కువగా నమోదైన కేసులు.. అన్‌లాక్ దశలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకినట్లుగా సమాచారం.
దేశంలో పంజా విసురుతున్న కోవిడ్… అసోం రాష్ట్రంలోనూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కరోనా బారినపడినట్లుగా తెలిసింది. కరీంగంజ్ జిల్లా పథర్ కండీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్ కు వైరస్ లక్షణాలు కనిపించటంతో…కరోనా టెస్టులు నిర్వహించారు. జిల్లా అధికారులు ఎమ్మెల్యే కృష్ణేందుపాల్ నుంచి స్వాబ్ సేకరించి పరీక్షకు పంపించగా రిపోర్ట్స్ లో పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని క్వారంటైన్ చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.