విశాఖ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ మూడు కేసులలో ఏపీలో మొత్తం కరోనా కేసులు ఏడుకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖలో పరిస్థితిపై సమీక్షించినట్టు చెప్పారాయన. ఇప్పటివరకు మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటికే ఈ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. కాగా.. వైరస్ వ్యాప్తి చర్యల్లో భాగంగా విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా ఏపీలో కరోనా వ్యాప్తికి అన్ని రకాల చర్యలు, కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాగా.. ఈ కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు.
అలాగే ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. దయచేసి ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. అలాగే మీ చుట్టుప్రక్క ఇళ్లకు విదేశీయులు ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒకరి తప్పు వల్ల.. మొత్తం సమాజం హరించిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా.. విదేశాల నుంచి వచ్చే వ్యక్తులు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలన్నారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో గ్రామ వాలంటీర్లదే.. కీలక పాత్రని, ఇందుకు సంబంధించి ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించాలని ఆయన సూచించారు.
Read more also: ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!
రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్
మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్ షా
కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే