వారిని రాష్ట్రంలోకి అనుమతించేదే లేదుః ఏపీ డీజీపీ స్పష్టం

నిబంధనలకు విరుద్ధంగా ఏపీలోకి వస్తోన్న వారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఏపీ సరిహద్దుల్లోకి వస్తోన్న వారికి రెండు వారాల పాటు

వారిని రాష్ట్రంలోకి అనుమతించేదే లేదుః ఏపీ డీజీపీ స్పష్టం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 26, 2020 | 6:58 PM

నిబంధనలకు విరుద్ధంగా ఏపీలోకి వస్తోన్న వారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఏపీ సరిహద్దుల్లోకి వస్తోన్న వారికి రెండు వారాల పాటు క్వారైంటన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని ఆయన అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్ చేసిన అభ్యర్థనను అర్థం చేసుకొని అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించకుండా సరిహద్దు వద్దకు వచ్చిన వారిని కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌ ఉద్దేశ్యం ఒక మనిషి నుంచి మరో మనిషికి.. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వైరస్ సంక్రమించకుండా ఉండేలాగా చేయడమేనని తెలిపారు. బయట ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అనుమతించడం లాక్‌డౌన్‌ ఉద్దేశ్యాన్ని నీరు గార్చడమేనని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఎక్కడివారు అక్కడే స్వీయ నియంత్రణ పాటించాలని గౌతమ్ సవాంగ్ అన్నారు. కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి పయనమైన విద్యార్థులు, ఉద్యోగులను ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో వందలాది వాహనాలు సరిహద్దుల్లో ఆగిపోవడంతో పాటు.. వేలాది మంది సరిహద్దుల్లో చిక్కుకున్నారు. క్వారంటైన్ ముగిసిన తరువాతే వారిని వారి వారి స్వగృహాలకు పంపుతామని అధికారులు స్పష్టం చేశారు.

Read This Story Also: ట్విట్టర్‌లో ‘చిరు’ సరసాలు.. మోహన్‌బాబు, పూరీలకు ఆసక్తికర సమాధానం..!