పెద్దపల్లి జిల్లాలో వైరస్ విజృంభణ..18 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శరవేగంగా పెరిగిపోతున్న వైరస్ పాజిటివ్ సంఖ్య జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి దాకా కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు జిల్లాలకు వ్యాపించాయి. తాజాగా ఉమ్మడి..

పెద్దపల్లి జిల్లాలో వైరస్ విజృంభణ..18 పాజిటివ్ కేసులు
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 07, 2020 | 7:30 PM

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. శరవేగంగా పెరిగిపోతున్న వైరస్ పాజిటివ్ సంఖ్య జనం గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి దాకా కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు జిల్లాలకు వ్యాపించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నూతనంగా18 కరోనా పాటిటివ్ కేసులు నమోదయ్యాయి. గోదావరిఖని ప్రాంతానికి చెందిన 9 మందికి, ఎన్టీపీసీకి చెందిన నలుగురు, పెద్దపల్లి మండలంలోని రాగినేడులో 3 వ్యక్తులకు వైరస్ సోకింది. రంగాపూర్ లో ఒకరికి, పెద్దపల్లిలో మరో వ్యక్తికి పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. వీరి ప్రైమరీ కాంట్రాక్టలను గుర్తించి హోం క్వారంటైన్ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. కేసుల తీవ్రత నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.