AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల మూసివేతపై ఫేక్‌న్యూస్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

కరోనా లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం జూన్ 30వ తేదీ వరకూ మూసివేయాలని ఏపీ ప్రభుత్వం.. టీటీడీ పాలక మండలితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది ఎంతమాత్రం నిజం కాదని..

తిరుమల మూసివేతపై ఫేక్‌న్యూస్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 4:28 PM

Share

కరోనా లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం జూన్ 30వ తేదీ వరకూ మూసివేయాలని ఏపీ ప్రభుత్వం.. టీటీడీ పాలక మండలితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది ఎంతమాత్రం నిజం కాదని, అసత్య ప్రచారమని టీటీడీ పాలక మండలి ఖండించింది. ప్రస్తుతం ఆలయం మూసివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలను నమ్మవద్దని కోరింది. కాగా ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని టీటీడీ కోరింది.

కాగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో 1,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 31 మంది మృతి చెందారు. అలాగే ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతుండగా.. 258 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 232 కేసులు, గుంటూరులో 254, కృష్ణా జిల్లాలో 223 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే అనంత‌లో 54, చిత్తూరులో 74, తూర్పు గోదావ‌రిలో 39, క‌డ‌ప‌లో 65, నెల్లూరులో 82, ప్ర‌కాశంలో 56, శ్రీకాకుళంలో 4, విశాఖ 22, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 54 కేసులు ఇప్ప‌టివ‌ర‌కూ న‌మోద‌య్యాయి. ఏపీలోని 13 జిల్లాల‌కు గాను విజ‌య‌న‌గరం మిన‌హా మిగ‌తా 12 జిల్లాలు క‌రోనా బారిన ప‌డ్డాయి.

Read More: 

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

Follow Us
స్టేడియంలో చెప్పుల వర్షం.. అభిమానుల మధ్య ముష్టియుద్ధం
స్టేడియంలో చెప్పుల వర్షం.. అభిమానుల మధ్య ముష్టియుద్ధం
10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే