క‌రోనా ఊర‌ట ! జ‌న‌గామ జిల్లాకు ఊపిరి వ‌చ్చింది…

క‌రోనా ఊర‌ట ! జ‌న‌గామ జిల్లాకు ఊపిరి వ‌చ్చింది…

మ‌ర్క‌జ్ మ‌త ప్రార్థ‌న‌ల‌కు వెళ్లోచ్చిన‌ వారిలో చాలా మందికి వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం వారితో స‌న్నిహితంగా మేలిగిన వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే.

Jyothi Gadda

|

Apr 11, 2020 | 4:27 PM

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌కు మూల కేంద్రంగా నిలిచింది ఢిల్లీ మ‌ర్క‌జ్. అక్క‌డ జ‌రిగిన మ‌త ప్రార్థ‌న‌ల‌కు వెళ్లోచ్చిన‌ వారిలో చాలా మందికి వైర‌స్ పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం వారితో స‌న్నిహితంగా మేలిగిన వారంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌న‌గామ జిల్లా నుంచి 79 మంది శాంపిల్స్ సేక‌రించిన అధికారులు వారిని క్వారంటైన్‌లో పెట్టారు. కాగా, నేడు వారికి సంబంధించిన వైద్య నివేదిక అందింది.

వెల్దండ గ్రామంలో ఒక వ్యక్తికి కరోన పాజిటివ్ రావడంతో ఆ గ్రామంలోని 79 మందిని 1వ తేదిన  జనగామ లోని ఎస్సీ ఎస్టీ గురుకులం  తరలించారు. వారందరికీ కరోనా టెస్ట్ నిర్వ‌హించ‌గా, అందరికీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ మేర‌కు జ‌న‌గామ డీసీపీ, ఆర్డిఓ ఆధ్వ‌ర్యంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.  మెడికల్ ఆఫీసర్ సమక్షంలో వారందరికీ స్టాంపులు వేసి మరో 10 రోజులు ఇంట్లోనే ఉండవలసిందిగా సూచించారు. అనంత‌రం వారిని స్వ‌గ్రామానికి పంపించారు. గత పది రోజులుగా వారి యోగక్షేమాలను చూసుకుంటూ వారిలో మనోధైర్యాన్ని నింపే విధంగా ప్రవర్తించిన పోలీసు, మెడికల్ మరియు రెవెన్యూ సిబ్బందికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు.

అటు, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని న‌ర్సాపురం మండలంలోని చాక్‌పల్లి గ్రామానికి చెందిన ఆరుగురికి క‌రోనా నెగేటివ్ అని తేలింది. చాక్‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మందికి వ్యక్తులు ఢిల్లీ మ‌ర్కజ్‌ వెళ్లారని తెలియడంతో మార్చి 29న అధికారులు వారిని నిర్మల్‌ క్వారంటైన్‌కు త‌ర‌లించారు. ఇందులో ఇద్దరికి పరీక్షలు జరుపగా కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. కాగా మిగతా ఆరుగురితో పాటు వీఆర్‌ఏ కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్‌గా రిపోర్టు రావడంతో వారిని అధికారులు గ్రామానికి తరలించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu