మూడుసార్లు క్లీన్ సిటీ…నేడు కోవిద్-19 హాట్‌స్పాట్..

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇండోర్‌లో గత మూడు రోజుల్లో కరోనా మృతుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతూ వస్తోంది. మధ్యప్రదేశ్‌లో

మూడుసార్లు క్లీన్ సిటీ...నేడు కోవిద్-19 హాట్‌స్పాట్..
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 4:48 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇండోర్‌లో గత మూడు రోజుల్లో కరోనా మృతుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతూ వస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకూ 33 మరణాలు సంభవించగా, ఒక్క ఇండోర్‌లోనే 27 మంది మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 6వ తేదీకి ఇండోర్‌లో మృతుల సంఖ్య 9. ఏప్రిల్ 7న అది 13కు చేరుకోగా, ఏప్రిల్ 8న 16కు, ఏప్రిల్ 9న 26కు చేరింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రతా నగరాల్లో ఒకటైన ఇండోర్ ఇప్పుడు కరోనా ‘హాట్‌స్పాట్‌’గా నిలవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

కాగా.. ఇటీవల మర్కజ్ సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని ఇంటికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలను నిర్వహించడానికి ఇండోర్ వెళ్లిన సమయంలో మహిళా డాక్టర్లపై దాడి చోటు చేసుకుంది. సిబ్బందిని అడ్డుకునేందుక జనం రాళ్లు రువ్వడంతో ఇద్దరు మహిళా డాక్టర్లు గాయపడ్డారు. దాంతో ఇండోర్ ఒక్కసారిగా వార్తల్లో ప్రధానంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం జరిపిన స్వచ్ఛతా సర్వేలో గత ఏడాది ఇండోర్ వరుసగా మూడోసారి తన అగ్రస్థానాన్ని నిలుపుకొంది. చెత్త ఏరివేయడంలో, పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడంలో గత నాలుగేళ్లుగా ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన కృషి ఇందుకు కారణం.

అయితే.. కోవిద్-19 విజృంభించడంతో మరణాలు అనూహ్యంగా పెరుగుతూ కరోనా ‘హాట్‌స్పాట్’గా ఇండోర్ మారిపోయింది. దీనికి పలు కారణాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. మొదట్లో కరోనా స్క్రీనింగ్ సరిగా జరగలేదనేది ఒక ఆరోపణగా ఉంది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేశారని, జనాభా, వాణిజ్య కార్యకలాపాలు కూడా త్వరిత గతిన కరోనా వ్యాప్తి చెందడానికి కారణాలని చెబుతున్నారు. వైద్యులు మాత్రం ఒకింత భిన్నంగా తమ వాదన చెబుతున్నారు. చాలా మందికి మొదట్లో కరోనా సింప్టమ్స్ లేనందున ఆలస్యంగా వారిని పరీక్షలు తీసుకువచ్చారని అంటున్నారు. దానికి తోడు వారికి మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.