AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

హిందూ మహాసముద్రంలో ఓ విచిత్ర ఆకారాన్ని గుర్తించారు.. అమెరికా పరిశోధకులు. ఓ పొడవైన తీగ లాంటి ఆకారం అది. సుమారు 150 అడుగుల వరకు ఉన్న ఈ భారీ రూపం మెరుపుతీగ మాదిరి ఉంది. ఇంతవరకూ సముద్రంలో ఇలాంటి వింతను బహుశా ఎవరూ చూడలేదని...

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 11, 2020 | 5:19 PM

Share

హిందూ మహాసముద్రంలో ఓ విచిత్ర ఆకారాన్ని గుర్తించారు.. అమెరికా పరిశోధకులు. ఓ పొడవైన తీగ లాంటి ఆకారం అది. సుమారు 150 అడుగుల వరకు ఉన్న ఈ భారీ రూపం మెరుపుతీగ మాదిరి ఉంది. ఇంతవరకూ సముద్రంలో ఇలాంటి వింతను బహుశా ఎవరూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. సముద్రంలోని ‘నింగాలూ కాన్యన్’ ప్రాంతంలో ఇది నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో.. అమెరికాకు చెందిన ష్మిట్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తమ డ్రోన్ కెమెరాలో ఈ ఆకారాన్ని బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

దీన్ని ‘సైఫనోఫోర్ వర్గానికి చెందిన అపోలిమియాగా’ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిని నీటిపై ‘తేలియాడే కాలనీ’ అని కూడా అంటారు. ఇవి జెల్లీఫిష్, కోరల్స్ వర్గానికి చెందిన జీవులని, సముద్ర గర్భంలో బాగా లోతైన ప్రాంతాల్లో ఇవి సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీని గురించి ఈ పరిశోధనలో పాలు పంచుకున్న మైరెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కార్లీ వీనర్ మాట్లాడుతూ.. వాస్తవానికి ‘సైఫనోఫార్ జీవులు’ చాలా చిన్నవి. చూడ్డానికి క్లోనింగ్ చేసిన జీవుల్లా ఉంటాయి. అవి అన్నీ కలిసి ఒకే దేహంలా పనిచేస్తాయి. అందుకే ఓ తీగ ఆకారంలా కనిపిస్తుంది. వీటిలె కొన్ని ప్రత్యుత్పత్తి చేయడం, మరికొన్ని ఈదడం వంటి పనులకే పరిమితమవుతాయి.. అంతేకానీ ఇంత భారీగా ఎప్పుడూ, ఎక్కడా కనిపించలేదని కార్లీ తెలిపారు.

Follow Us
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే