నాటుసారా కాస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్​..

నాటుసారా కాస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్​..

ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఏపీలో గ్రామ వాలంటీర్ వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేస్తోంది. క‌రోనా వైర‌స్ సింటమ్స్ ఉన్నవారిని గుర్తించ‌డం, గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు క‌రోనాపై అవ‌గాహ‌న కల్పించ‌డం స‌హా చాలా కార్య‌క్ర‌మాల్లో యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. అయితే కొంత‌మంది గ్రామ‌ వాలంటీర్స్ చేసే ప‌నుల వ‌ల్ల అంద‌రికి బ్యాడ్ నేమ్ వ‌స్తోంది​. బాధ్యతగా ఉండాల్సిన తరుణంలో దారి తప్పాడు ఓ గ్రామ వాలంటీర్. గ్రామంలో నాటుసారా తయారు చేస్తూ పోలీసులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈ […]

Ram Naramaneni

|

Apr 11, 2020 | 6:56 PM

ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఏపీలో గ్రామ వాలంటీర్ వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేస్తోంది. క‌రోనా వైర‌స్ సింటమ్స్ ఉన్నవారిని గుర్తించ‌డం, గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు క‌రోనాపై అవ‌గాహ‌న కల్పించ‌డం స‌హా చాలా కార్య‌క్ర‌మాల్లో యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. అయితే కొంత‌మంది గ్రామ‌ వాలంటీర్స్ చేసే ప‌నుల వ‌ల్ల అంద‌రికి బ్యాడ్ నేమ్ వ‌స్తోంది​. బాధ్యతగా ఉండాల్సిన తరుణంలో దారి తప్పాడు ఓ గ్రామ వాలంటీర్. గ్రామంలో నాటుసారా తయారు చేస్తూ పోలీసులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈ ఘటన జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో నాటు సారా త‌యారుచేస్తూ.. గ్రామ వాలంటీర్ పట్టుబడ్డాడు. గ్రామానికి శివార్ల‌లో కొందరు సారా కాస్తున్నారన్న ఇన్ఫ‌ర్మేష‌న్ తో ఎక్సైజ్​ సిబ్బంది సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ క్రమంలో 30 లీటర్ల సారాతో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చెడుదారులు ప‌ట్టే యువ‌కుల‌ను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu