కరోనా కట్టడికి.. గూగుల్‌, యాపిల్‌ సంయుక్తంగా.. ‘కరోనావైరస్ ట్రాకింగ్ సిస్టమ్’..

కరోనా కట్టడికి.. గూగుల్‌, యాపిల్‌  సంయుక్తంగా.. 'కరోనావైరస్ ట్రాకింగ్ సిస్టమ్'..

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కట్టడికి బ్లూటూత్ సాంకేతిక పరిజ్ఞానంతో చక్కటి పరిష్కారం కనుగొంటామని ఐటీ దిగ్గజ సంస్థలు

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 11, 2020 | 4:16 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కట్టడికి బ్లూటూత్ సాంకేతిక పరిజ్ఞానంతో చక్కటి పరిష్కారం కనుగొంటామని ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్‌, యాపిల్‌ శుక్రవారం సంయుక్తంగా ప్రకటించాయి. అటు ప్రభుత్వాలకు.. ఇటు ఆరోగ్య సంస్థలకు ఉపయోగపడేలా ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్’ (కరోనా బాధితులు ఎవరిని కలిశారనే సమాచారం) టెక్నాలజీని రూపొందిస్తామని వెల్లడించాయి.

కోవిద్-19 ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీని వ్యాప్తిని కట్టడిచేయడంలో ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’ కీలకమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ), ఆపరేటింగ్ సిస్టమ్-లెవల్ సాంకేతిక అంశాల ఆధారంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పాయి. అది రెండు దశల్లో అమలు చేయాల్సి ఉంటుందని, రెండు కంపెనీలు మే నెలలో.. ప్రజారోగ్య సంస్థల యాప్‌లను ఉపయోగించి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లను సమన్వయపరిచి ఏపీఐలను విడుదల చేస్తామని తెలిపాయి.

కాగా.. త్వరలో ఒక సమగ్రమైన బ్లూటూత్‌ ఆధారిత కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను రూపొందించనున్నామని చెప్పాయి. ఈ టెక్నాలజీలో వ్యక్తులతో పాటు అనేక యాప్‌లు, ప్రభుత్వ సంస్థలు, వైద్య ఆరోగ్య సంస్థలను చేర్చనున్నట్లు పేర్కొన్నాయి. ఈ సాంకేతికతను ఉపయోగించి కరోనాను కట్టడిచేసి.. సాధారణ జనజీవనం పునరద్ధరించేందుకు కృషిచేస్తామని తెలిపాయి. అందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజా ఆరోగ్య వైద్య సిబ్బంది సహకారం తీసుకుంటామని స్పష్టంచేశాయి. ఈ క్రమంలో వ్యక్తుల గోపత్యకు, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని గూగుల్‌, యాపిల్‌ సంయుక్తంగా వెల్లడించాయి.

[svt-event date=”11/04/2020,3:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu