కరోనా కంటైన్మెట్ ఏరియాలో కనిపిస్తే కేసు

కరోనా కంటైన్మెట్ ఏరియాలో కనిపిస్తే కేసు

కరోనా కట్టడి కోసం మరింత పకడ్బందీ చర్యలకు ఉపక్రమించిన హైదరాబాద్ నగర పోలీసులు కంటైన్మెంట్ ఏరియాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ ఏరియాల్లో కనిపిస్తే చాలు కేసులు నమోదు చేసి తామేంటో సత్తా చాటుతున్నారు.

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Apr 11, 2020 | 5:06 PM

కరోనా కట్టడి కోసం మరింత పకడ్బందీ చర్యలకు ఉపక్రమించిన హైదరాబాద్ నగర పోలీసులు కంటైన్మెంట్ ఏరియాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ ఏరియాల్లో కనిపిస్తే చాలు కేసులు నమోదు చేసి తామేంటో సత్తా చాటుతున్నారు. నిజానికి గురువారం సాయంత్రం నుంచి కంటైన్మెంట్ ఏరియాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కానీ.. శుక్రవారం పోలీసులు కాస్త మెతగ్గా కనిపించడంతో పలు ప్రాంతాల్లో జనం సరైన కారణాలు లేకుండా రోడ్డెక్కి సాధారణ జనజీవనాన్ని తలపించారు.

ప్రజల నిర్లక్ష్యపు ధోరణితో విసుగొచ్చిన పోలీసులు శనివారం ఉదయం నుంచి పక్కా చర్యలకు ఉపక్రమించారు. టోలీచౌకీ, రెడ్ హిల్స్, కూకట్‌పల్లి, చందానగర్ ఏరియాల్లో బందోబస్తులోని లోటుపాట్లను TV9 ఎత్తిచూపడంతో పోలీసులు శనివారం పక్కాగా చర్యలు చేపట్టారు. రెడ్ హిల్స్ ఏరియాలో పాజిటివ్ కేసుల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మనిషి బయట కనిపిస్తే చాలు కేసులు నమోదు చేస్తుండడంతో రోడ్డెక్కేందుకు జనం జంకుతున్నారు.

హాట్ స్పాట్స్ ఏరియాల్లో కర్ప్యూ వాతావరణం కనిపిస్తోంది. కంటైన్మెంట్ క్లస్టర్లలో స్ట్రాంగ్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు పోలీసులు. రాకపోకలను అధికార యంత్రాంగం పూర్తిగా కట్టడి చేసింది. ఫస్టు వార్నింగ్ ఆ తరువాత కేసులే అంటున్న పోలీసులను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి 30 నివాసాలకు ఒక వాలంటీర్ ద్వారా మోనిటరింగ్ చేస్తున్నారు. అయితే నిత్యవసరాలకు సమస్య రాకుండా అదనపు ఏర్పాట్లు చేశారు అధికారులు. దాంతో కంటైన్మెంట్ క్లస్టర్లలో జనసంచారం కనిపించడం లేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu