స‌బ్జా గింజ‌ల‌తో వైర‌స్ ల‌క్ష‌ణాల‌కు చెక్‌..!

మ‌న అంద‌రికీ తెలిసిన స‌బ్జా గింజ‌ల‌తో కూడా శ‌రీరానికి కావాల్సిన మంచి పోష‌ణ ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తుల‌సి జాతికి చెందిన స‌బ్జాతో వైర‌స్‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

స‌బ్జా గింజ‌ల‌తో వైర‌స్ ల‌క్ష‌ణాల‌కు చెక్‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 09, 2020 | 2:46 PM

క‌రోనా వైర‌స్‌ నేప‌థ్యంలో అంద‌రూ హ‌డ‌లెత్తిపోతున్నారు. ఏ ఆహారం తినాలి..? ఎది తింటే వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉంటాం..? ఇలాంటి సందేహాలు ప్ర‌స్తుతం అంద‌రినీ వెంటాడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌న అంద‌రికీ తెలిసిన స‌బ్జా గింజ‌ల‌తో కూడా శ‌రీరానికి కావాల్సిన మంచి పోష‌ణ ల‌భిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తుల‌సి జాతికి చెందిన స‌బ్జాతో వైర‌స్‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సూచిస్తున్నారు.
స‌బ్జా గింజ‌లు మ‌నంద‌రికీ తెలుసు.  తీపి తులసి, ఫాలుదా అని పిలిచే ఈ గింజ‌ల్లో అద్భుత‌మైన పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉన్నాయి. న‌ల్ల‌గా ఉండి ఆవాల‌కంటే కూడా చిన్న సైజులో ఉండే ఈ గింజ‌ల్లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కొవ్వులు, పీచు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ గింజ‌ల్లో యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్క‌లంగా ఉన్నాయి. వీటిని నీళ్ల‌లో నాన‌బెట్టి ఆ నీటిని తాగితే గింజ‌లు న‌మ‌ల‌డానికి వీలుగా ఉంటాయి. ప్ర‌తిరోజూ క‌నీసం రెండు టీస్పూన్ల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌టం ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.
స‌బ్జా గింజ‌ల‌ను వేడినీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌టం వ‌ల‌న ఇవి బాగా ఉబ్బి, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు విడుద‌లై… జీర్ణ‌క్రియ‌కు ప‌నికొచ్చే ఎంజైములు ఉత్ప‌త్తి అవుతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండ‌టం వ‌ల‌న…ఈ ఆసిడ్లు శ‌రీరంలో కొవ్వుని క‌రిగించే జీవ‌క్రియ‌ని వేగ‌వంతం చేస్తాయి. అంతే కాక ఇందులో ఉన్న పీచు ఆకలిని త‌గ్గిస్తుంది. ఈ కార‌ణంగా స‌బ్జా గింజ‌లు బ‌రువుని త‌గ్గిస్తాయ‌ని చెబుతున్నారు.
సబ్జా గింజలలో యాంటిస్పాస్మోడిక్ ఉంటుంది. ఇవి స్పాస్మాటిక్ కండరాలలో ఉద్రిక్తతను తగ్గించి ఉపశమనం క‌లిగిస్తాయి. ఈ విధంగా దగ్గును నియంత్రించడంలో సాయపడుతుంది. ఇవి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వైసెనిన్, ఓరింటిన్, బీటా కెరోటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ శరీర  రక్షణ వ్యవస్థను బలపరుస్తాయ‌ని చెబుతున్నారు. అయితే, చిన్న‌పిల్ల‌లు, గ‌ర్భీణీలు మాత్రం వైద్యుల స‌ల‌హా మేర‌కు మాత్ర‌మే వీటిని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!