AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నివారణకు’హైడ్రాక్సీ’ ఉంటే చాలట..మహిళా డాక్టర్ వింత వ్యాఖ్యలు

కరోనా వైరస్ నివారణకు మాస్కులు గానీ, లాక్ డౌన్ వంటి చర్యలు గానీ అవసరం లేదని, యాంటీ మలేరియా డ్రగ్..హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ ఉంటే చాలని ఓ మహిళా డాక్టర్ చెబుతోంది. స్టెల్లా ఇమ్మాన్యుయేల్ అనే ఈమె...

కరోనా నివారణకు'హైడ్రాక్సీ' ఉంటే చాలట..మహిళా డాక్టర్ వింత వ్యాఖ్యలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 29, 2020 | 2:58 PM

Share

కరోనా వైరస్ నివారణకు మాస్కులు గానీ, లాక్ డౌన్ వంటి చర్యలు గానీ అవసరం లేదని, యాంటీ మలేరియా డ్రగ్..హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ ఉంటే చాలని ఓ మహిళా డాక్టర్ చెబుతోంది. స్టెల్లా ఇమ్మాన్యుయేల్ అనే ఈమె.. తన వింత వ్యాఖ్యలతో అలజడి సృష్టిస్తోంది. నైజీరియాలో పుట్టిన ఈ డాక్టర్.. ‘అమెరికన్ ఫ్రంట్ లైన్ డాక్టర్స్’ అనే గ్రూప్ లో హైడ్రాక్సీ మందును ప్రమోట్ చేస్తూ..తాను దీన్ని సుమారు 350 మంది కరోనా రోగులకు ఇచ్చానని, అందరూ కోలుకున్నారని ప్రకటించుకుంది. తాజాగా వాషింగ్టన్ లోని సుప్రీంకోర్టు భవనం మెట్ల మీద నిలబడి స్పీచ్ ఇస్తూ.. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేసింది.

కొన్ని ఆత్మలు మహిళలతో శృంగారం చేయడంవల్ల గర్భవస్రావం జరుగుతుంది.. ఏలియన్ల (గ్రహాంతర జీవుల) డీ ఎన్ ఏ తో రోగులకు చికిత్స చేయడంవల్ల మానవ జాతి, రాక్షస జాతి కలిసిపోయింది..’అని స్టెల్లా పేర్కొంది. గే వివాహాలవల్ల పెద్దలు పిల్లలను పెళ్లి చేసుకుంటారని, ‘వైట్ కోట్ సమ్మిట్’ పేరిట ఏర్పడిన ఫిజిషియన్ల కూటమిలో సభ్యురాలైన తన మాటలు విశ్వసించాలని చెప్పింది. ఇంతేకాదు..’ఫైర్ పవర్ మినిస్ట్రీస్’ అనే మతపరమైన సంస్థకు తను నాయకురాలినని చెప్పుకుంటూ.. గతంలోనే ఓ వీడియో విడుదల చేసి.. ఈ ప్రపంచాన్ని మనుషులు కాకుండా ‘రెస్టిలియన్ స్పిరిట్స్’ అనే సగం మనుషులు, సగం ఏలియన్స్ పాలన సాగిస్తున్నారని స్టెల్లా తెలిపింది. తన తాజా క్లిప్ ని ఫేస్ బుక్ తొలగించగా.. ఆ క్లిప్ ని మళ్ళీ పోస్ట్ చేయకపోతే ఫేస్ బుక్ సర్వర్లు క్రాష్ అవుతాయని ఆమె శాపనార్థాలు పెట్టింది. అమెరికాలో ఈ విధమైన వ్యక్తులు మరికొందరు ఇలాగే ప్రవర్తిస్తూ ఈ కరోనా కాలంలో ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.