అమెరికా ఛార్జి లక్ష.. బ్రిటన్ రూ. 50 వేలు.. ఇంకా…

విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశం తీసుకు వచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులు నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఏడు, బ్రిటన్ నుంచి కూడా ఏడు విమానాల ద్వారా ఇండియన్స్ ని తరలిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రయాణ ఖర్చులను కేంద్రం వెల్లడించింది. బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరేందుకు  రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. యుఎస్ అయితే ఈ చార్జీని లక్షగా నిర్ణయించారు. […]

అమెరికా ఛార్జి లక్ష.. బ్రిటన్ రూ. 50 వేలు.. ఇంకా...
విమాన ప్రయాణ ఛార్జీల మోత: ఏప్రిల్‌ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్‌ఎఫ్‌) పెరగనుంది. ఏప్రిల్‌ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.ఇక ఏప్రిల్ నుంచి మీ విమాన ప్రయాణాన్ని మరింత ఖరీదైనదిగా మారిపోయింది. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ధర పెరగనుంది.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 5:47 PM

విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశం తీసుకు వచ్చేందుకు కేంద్రం 64 విమానాలు రెడీ చేసింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 13 వరకు విమాన సర్వీసులు నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఏడు, బ్రిటన్ నుంచి కూడా ఏడు విమానాల ద్వారా ఇండియన్స్ ని తరలిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రయాణ ఖర్చులను కేంద్రం వెల్లడించింది. బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరేందుకు  రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. యుఎస్ అయితే ఈ చార్జీని లక్షగా నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీ చేరేందుకు రూ. 12 వేలు పే చేయవలసి ఉంటుంది. ఎక్కువ విమానాలను కేరళ నుంచి పంపనున్నారు. ఢిల్లీ-తమిళనాడు నుంచి 11 చొప్పున, మహారాష్ట్ర-తెలంగాణ నుంచి 7 చొప్పున, గుజరాత్ నుంచి ఐదు, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక నుంచి మూడు చొప్పున, పంజాబ్-యూపీ నుంచి ఒక్కొక్కటి చొప్పున విమానాలు ఎగరనున్నాయి.

తొమ్మిది దేశాల నుంచి వచ్ఛే పదకొండు విమానాలు తమిళనాడు చేరుకుంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. మనిలా-చెన్నై, షికాగో-ఢిల్లీ, హైదరాబాద్-న్యూయార్క్-ఢిల్లీ-హైదరాబాద్, కువైట్-కోజికోడ్, శాన్ ఫ్రాన్సిస్కో-ఢిల్లీ-బెంగుళూరు రూట్లను పరిశీలిస్తున్నట్టు ఆయన వివరించారు. రోజూ దాదాపు రెండు వేల  మంది భారతీయులను తరలించే అవకాశం ఉందన్నారు.