Coronavirus: భారత్‌కు మరోసారి కరోనా ముప్పు.. నాలుగో వేవ్‌లో 75 శాతం మందిపై ప్రభావం.?

|

Mar 16, 2022 | 4:56 PM

Coronavirus: కరోనా (Corona) ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చని అంతా భావించారు. ప్రపంచ దేశాలను ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్ర దెబ్బ తీసిన కరోనా థార్డ్‌ వేవ్‌ త్వరగా మూగిసింది.. ఇకపై మరో వేవ్‌ రాదని అంతా సంతోషించే లోపే మరోసారి కరోనా వార్తలు కలవరపెడుతున్నాయి...

Coronavirus: భారత్‌కు మరోసారి కరోనా ముప్పు.. నాలుగో వేవ్‌లో 75 శాతం మందిపై ప్రభావం.?
Corona 4th Wave
Follow us on

Coronavirus: కరోనా (Corona) ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చని అంతా భావించారు. ప్రపంచ దేశాలను ఆర్థికంగా, ఆరోగ్యంగా తీవ్ర దెబ్బ తీసిన కరోనా థార్డ్‌ వేవ్‌ త్వరగా మూగిసింది.. ఇకపై మరో వేవ్‌ రాదని అంతా సంతోషించే లోపే మరోసారి కరోనా వార్తలు కలవరపెడుతున్నాయి. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. 2020 మార్చి తర్వాత రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడంతో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్‌ విధించారు. సోమవారం ఒక్కరోజే 2,300 కేసులు రికార్డ్‌ అయ్యాయి. ఒక రోజు ముందు 3,400 కేసులు నమోదయ్యాయి. చైనాలో గడిచిన రెండేళ్లలో రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

చైనాలో పెరుగుతోన్న ఈ కేసుల సంఖ్య మరోసారి భారత్‌కు కరోనా ముప్పు తప్పదా అన్ని ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. భారత్‌లో నాలులో వేవ్‌ కచ్చితంగా ఉంటుందని వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి కరోనా ప్రభావం ఏకంగా 75 శాతం మందిపై పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కరోనా BA.2 వేరియంట్‌తో మూడో వేవ్‌ వచ్చింది. ఇప్పటికీ ఆ వేరియంట్‌ ఆనవాళ్లు ఉండడంతో నాలుగో వేవ్‌కు అవకాశం ఉందని కోవిడ్‌ 19 టాస్క్‌ గ్రూప్‌ను లీడ్‌ చేస్తున్న డాక్టర్‌ ఎన్‌కే అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ చేసిన అధ్యయనాల్లోనూ భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అంచనాల మేరకు జూలైలో నాలుగో దశ ప్రభావం మొదలువుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే రెండుడోస్‌ల వ్యాక్సిన్‌, సీనియర్ సిటిజన్స్‌కి బూస్టర్ డోస్ కారణంగా కొవిడ్ మరణాలను భారత్‌ అదిగమించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరణాల విషయంలో నాలుగోవేవ్‌ ప్రభావాన్ని మాత్రం ఇప్పుడే అంచనా వేయలేమని చెబుతున్నారు. ఇక దేశంలో 12 నుంచి 14 మధ్య టీనేజర్స్‌కి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఫోర్త్‌ వేవ్‌పై పెద్దగా ఆందోళన అవసరం లేదని ఎన్‌కే అరోరా అభిప్రాయపడుతున్నారు.

Also Read: Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్, శరన్‌ల వివాదానికి ఎండ్ కార్డు.. అకౌంట్స్ సెటిల్ చేసుకున్నామన్న శరన్

Bhagwant Mann Swearing: భగవంత్‌ సింగ్‌ మాన్‌ అనే నేను.. భగత్‌ సింగ్‌ స్వగ్రామంలో పంజాబ్‌ సీఎంగా ప్రమాణం..

స్కైడైవింగ్ చేయాలనుకుంటున్నారా ? అయితే మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలు ఇవే..