Antibodies Cocktail: సత్ఫలితాలిస్తున్న కోవిడ్ డ్రగ్.. యాంటీబాడీస్ కాక్‌టైల్.. భారత్‌లో ఐదు రోజులకే కోలుకున్న వృద్ధుడు
COVID-19 Antibodies Cocktail: ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్‌టెయిల్‍తో ట్రీట్మెంట్ తీసుకున్న కోలుకున్న వ్యక్తి బుధవారం నాడు కోలుకున్నాడు. హర్యానాకు చెందిన
COVID-19 Antibodies Cocktail: ఇండియాలో తొలిసారి యాంటీబాడీస్ కాక్‌టెయిల్‍తో ట్రీట్మెంట్ తీసుకున్న కోలుకున్న వ్యక్తి బుధవారం నాడు కోలుకున్నాడు. హర్యానాకు చెందిన 84 ఏళ్ల మొహబ్బత్ సింగ్ కోవిడ్ డ్రగ్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ తీసుకున్న అనంతరం ఐదు రోజులకే కోలుకున్నాడు. అయితే.. అమెరికా, యూరప్‌లలో ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టైల్ వాడకం ఎక్కువగా ఉంది. గతేడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ డ్రగ్ తీసుకున్న అనంతరం ఇది ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది.
గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్న 84 ఏళ్ల వృద్ధుడు మొహబ్బత్ సింగ్‌కు ఐదు రోజులుగా యాంటీబాడీ కాక్టెయిల్ డ్రగ్‌ను అందించారు. ఈ చికిత్స అనంతరం మొహబ్బత్ సింగ్ బుధవారం ఆసుపత్రి నుంచి సురక్షితంగా డిశ్చార్జ్ అయినట్లు మేదాంతా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇది సక్సెస్ అయితే మరింతమంది పేషెంట్లను కాపాడవచ్చని వైద్యులు తెలిపారు.
పేషంట్ డిశ్చార్జ్ అనంతరం మేదాంత ఛైర్మన్ డా.ట్రెహాన్ మాట్లాడుతూ.. పేషెంట్‌ను మానిటర్ చేస్తూనే ఉంటామన్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టైల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. నిరంతరం వైరస్ అనేది శరీరంలో తగ్గుతూ వచ్చిందన్నారు. అలాగే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్లకే ఈ ట్రీట్మెంట్ ఇస్తామంటూ డా.ట్రెహాన్ వెల్లడించారు.
ఇన్ఫెక్షన్ సోకిన పేషెంట్ కు కసిరివిమబ్, ఇండెవిమబ్ ఇంజెక్షన్లు ఇచ్చామని.. దీంతో తొలి దశలోనే వైరస్‌ను పేషెంట్ శరీరం అంతటా వ్యాపించకుండా బ్లాక్ చేయగలిగామన్నారు. ఈ యాంటీబాడీస్ కాక్‌టైల్ డ్రగ్ కొవిడ్-19పై సమర్థవంతంగా పోరాడిందని తెలిపారు. B.1.617వేరియంట్‌పై కూడా ఎఫెక్టివ్ గా పనిచేసిందని.. ఇది మరో కొత్త ఆయుధమని అని మేదాంత హాస్పిటల్ ఛైర్మన్ పేర్కొన్నారు.
Also Read: