Telangana Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,221 శాంపిల్స్‌ని సేకరించి టెస్టులు నిర్వహించగా.. వీరిలో 4,693 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,16,404 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులో 6,876 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,917 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,56,620 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా 2,867 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా.. రికవరీ రేటు 88.42 శాతం ఉంది.
తాజాగా రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 39, భద్రాద్రి కొత్తగూడెం – 118, జీహెచ్ఎంసీ – 734, జగిత్యాల – 140, జనగాం – 45, జయశంకర్ భూపాలపల్లి – 63, జోగులాంబ గద్వాల్ – 66, కామారెడ్డి – 52, కరీంనగర్ – 209, ఖమ్మం – 198, కొమురంభీం ఆసిఫాబాద్ – 50, మహబూబ్ నగర్ – 122, మహబూబాబాద్ – 113, మంచిర్యాల – 130, మెదక్ – 57, మేడ్చల్ మల్కాజిగిరి – 285, ములుగు – 58, నాగర్ కర్నూలు – 156, నల్లగొండ – 296, నారాయణ పేట్ – 39, నిర్మల్ – 37, నిజామాబాద్ – 98, పెద్దపల్లి – 126, రాజన్న సిరిసిల్ల – 136, సిద్దిపేట – 150, సూర్యాపేట – 45, వికారాబాద్ – 179, వనపర్తి – 95, వరంగల్ రూరల్ – 189, వరంగల్ అర్బన్ – 161, యాదాద్రి భువనగిరి – 120 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read:
Revanth Reddy : తెలంగాణలో కరోనా తగ్గించి చూపడం వల్లనే ఈ పరిస్థితులు : ఎంపీ రేవంత్ రెడ్డి
Actor Kamal Haasan: కమల్ హాసన్ వల్లే సినిమా ఆలస్యం అవుతుంది.. సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు
Radhe Movie: సల్మాన్ రేంజ్‌కు ఇదొక ఉదాహరణ.. ‘రాధే’ కోసం ఎగబడ్డ ఫ్యాన్స్.. సర్వర్ క్రాష్..