కరోనా టెర్రర్.. జీహెచ్‌ఎంసీ సంచలన నిర్ణయం
తెలంగాణలో కరోనా టెర్రర్ రోజురోజుకు అధికమవుతోంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రోజూ వందల కొద్ది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి.

తెలంగాణలో కరోనా టెర్రర్ రోజురోజుకు అధికమవుతోంది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రోజూ వందల కొద్ది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాధారణ ప్రజలకు అనుమతిని ఇవ్వడం లేదని తెలిపింది. ఈ క్రమంలో ఇక మీదట ఫిర్యాదులు, విఙ్ఞప్తులకు రావొద్దంటూ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్లో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పనిదినాల్లో రోజుకు 500 నుండి 700 ఫిర్యాదులు స్వీకరిస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.
కాగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మొత్తం 1500 సిబ్బంది ఉండగా.. 25 మందికి కరోనా సోకింది. పారిశుధ్య కార్మికులు మొదలు ఉన్నతాధికారుల వరకు పలువురు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,674కు చేరిన విషయం తెలిసిందే.
Read This Story Also: Breaking: ఏపీ వైసీపీ ఎమ్మెల్యే, గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్