టీవీ9 తెలుగులో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ స్పోర్ట్స్‌కి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. అలాగే, బిజినెస్, ఆటో, వైరల్ కంటెంట్ అందిస్తుంటాను. 2017లో కేరీర్ ప్రారంభించాను
ICC women’s ODI rankings 2025: వన్డే ర్యాంకింగ్స్ లో స్థానాన్ని పటిలం చేసుకున్న లేడీ కోహ్లీ! రేసులో కొత్త ప్లేయర్
తాజా ICC మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లాండ్ ప్లేయర్ అమీ జోన్స్ సెంచరీలతో ఆకట్టుకొని నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా ఆడిన ఆమె బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్ విభాగంలో కేట్ క్రాస్ కూడా మెరుపు ప్రదర్శన ఇచ్చింది. ఆమె ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. రాబోయే భారత పర్యటనలో వీరి ర్యాంకులు మరింత మెరుగయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 12:30 pm
Video: మా RCB నే ట్రోల్ చేస్తావా? CSK మాజీ ప్లేయర్ ను ఆడేసుకున్న ఫ్యాన్స్! నెట్టింట వీడియో వైరల్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సమయంలో CSK మాజీ ఆటగాడు బద్రీనాథ్‌ను RCB అభిమానులు ట్రోల్ చేయడంతో, అతడు సంజ్ఞగా బొటనవేళ్లు చూపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు బద్రీ RCBపై విమర్శలు చేసిన నేపథ్యంలో అభిమానులు స్పందించారు. అయితే బెంగళూరులో జరిగిన RCB విజయ కవాతులో ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం మిగిల్చింది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 12:10 pm
WTC Final: కోహ్లీ శత్రువుకి అన్యాయం చేసిన మిస్టర్ సైలెన్సర్! అందుకే ఆ ఇద్దరిని తీసుకోలేదు అంటూ..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ముందు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రధానంగా స్కాట్ బోలాండ్‌ను తప్పించి జోష్ హేజిల్‌వుడ్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. మిడిలార్డర్‌లో మార్నస్ లాబుషేన్ ఎంపిక చేయగా, టీనేజ్ ఆటగాడు సామ్ కాన్స్టాస్‌ను పక్కన పెట్టారు. స్కాట్ తప్పిపోవడం వల్ల అతనిపై అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, అయితే కమ్మిన్స్ అయితే ఇది సాదారణ వ్యూహాత్మక మార్పేనని స్పష్టం చేశాడు.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 11:50 am
PCB: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు! ఆజాముడితో పాటు ఆ ఇద్దరిని పీకిపారేసిన సెలక్టర్లు!
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలను తప్పిస్తూ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల డీలా ప్రదర్శన, ఫామ్ లోపం, మేనేజ్‌మెంట్‌తో అసహకారం వంటి కారణాలతో వీరిని తాత్కాలికంగా వైట్ బాల్ టూర్లకు ఎంపిక చేయలేదు. T20I సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. విండీస్, శ్రీలంక వంటి సిరీస్‌లకు ముందుగా బ్యాకప్ బలోపేతానికి పాక్ సీరియస్‌గా ఆలోచన చేస్తోంది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 11:20 am
WTC: ఫైనల్ నుండి భారత్ అవుట్.. కట్ చేస్తే.. 12 కోట్లు అందుకోనున్న BCCI
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు భారత్ చేరుకోకపోయినా, మూడవ స్థానంలో నిలిచి రూ. 12.33 కోట్లు ప్రైజ్ మనీని అందుకుంది. ICC నిర్ణయించిన ప్రైజ్ మనీ విధానం ప్రకారం ఇది లభించింది. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌కు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అర్హత సాధించగా, భారత్ మాత్రం ప్రదర్శన పరంగా వెనుకబడింది. అయినా ఆర్థికంగా భారత్‌కు కలిగిన లాభం WTC లాంటి పోటీల ప్రభావాన్ని వెల్లడిస్తోంది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 10:50 am
FAB 4 : ఈ తరం ఫ్యాబ్ 4 వాళ్ళే.. కేన్ మావా ప్రిడిక్షన్! కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది అతడేనట
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన “ఫ్యాబ్ ఫోర్” కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, రూట్ మెల్లగా వెనకకు తగ్గుతున్న వేళ, నూతన తరం క్రికెటర్లు గిల్, జైస్వాల్, రచిన్, బ్రూక్, గ్రీన్ వారిని భర్తీ చేయగలరా అనే చర్చ మొదలైంది. కేన్ విలియమ్సన్ వీరిపై తన అభిప్రాయాన్ని వెల్లడించగా, డారిల్ కల్లినన్ మాత్రం విరాట్ కోహ్లీనే అత్యుత్తముడు అని కొనియాడాడు. ఫ్యాబ్ ఫోర్ వారసత్వాన్ని మోయేందుకు యువ క్రికెటర్లు మెరుగైన స్థిరత, కఠినత ప్రదర్శించాల్సిన అవసరం ఉందని విశ్లేషణ సాగుతోంది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 10:30 am
WTC Final 2025: రెండో రోజే ఫైనల్ కి వరుణ్ బ్రో ముప్పు! రద్దయితే ఎలా మరి?
WTC 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ‘అల్టిమేట్ టెస్ట్’గా పిలవబడే పోరులో ఆస్ట్రేలియా తమ టైటిల్‌ను కాపాడుకోవాలని ఆశిస్తుంటే, ప్రోటీస్ మాత్రం తమ తొలి WTC గెలుపుతో పాటు ప్రపంచ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని రాసేందుకు సిద్ధమవుతోంది. ఇది ప్రోటీస్‌కు తొలి ఫైనల్ కాగా, టైటిల్ కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే జూన్ 12 వర్ష సూచనలతో మ్యాచ్‌పై సస్పెన్స్ నెలకొంది. వర్షం వల్ల ఫలితం రాకపోతే, టైటిల్‌ను రెండు జట్లు పంచుకోవాల్సి వస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనతోపాటు వాతావరణం కూడా ఫలితంపై కీలక ప్రభావం చూపనుంది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 10:10 am
MS Dhoni: అతడు జేబులు కొట్టే దొంగ కన్నా డేంజర్! ‘తల’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శాస్త్రి!
ఎంఎస్ ధోని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించడంతో భారత క్రికెట్‌కు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి చేసిన “పిక్ పాకెట్ కంటే వేగం” అనే హాస్య వ్యాఖ్య అభిమానులను కడుపుబ్బా నవ్వించగా, ధోని వికెట్ కీపింగ్ ప్రతిభకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. ధోని శాంతస్వభావం, ఒత్తిడిలో స్థిరత, వ్యూహాత్మక నాయకత్వం ఆయన్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అతను ఇప్పటికీ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచే క్రికెట్ మహానుభావుడిగా ఉంటాడు.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 9:50 am
IPL 2025: మొత్తం నేనే చేశాను! ఫైనల్ ఇన్నింగ్స్ పై స్పందించిన వధేరా!
ఐపీఎల్ 2025 గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ తొలి టైటిల్‌ను అందుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెహాల్ వధేరా నెమ్మదిగా ఆడడం పంజాబ్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. మ్యాచ్ అనంతరం వధేరా తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ బాధతో స్పందించాడు, ఇదే ఓటమి తన జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నాడు.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 9:32 am
WTC 2025 SA Playing XI: లార్డ్ బవుమా ప్లాన్ అదిరిపోయిందిగా! కంగారులకు పంచ్ ఇచ్చే తోపులు వీరే!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు తమ ప్లేయింగ్ XIను ప్రకటించింది. కెప్టెన్ బావుమా ఆధ్వర్యంలో మార్క్రామ్, రికెల్టన్ ఓపెనర్లుగా ఉంటారు. బౌలింగ్ విభాగంలో రబాడా, ఎన్‌గిడి, జాన్సెన్, ముల్డర్‌తో శక్తివంతమైన పేస్ యూనిట్ కనిపించనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి ప్రాధాన్యమిచ్చి, అనుభవజ్ఞుల ఎంపికతో స్ట్రాటజిక్ ప్లాన్ అమలుపరుస్తోంది.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 9:22 am
Ind vs Eng: ఇంగ్లాండ్ పిచ్ క్యూరేటర్లకు గంభీర్ మాస్ వార్నింగ్! ఎలాంటి పిచ్ అడిగాడో తెలుసా?
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు శిక్షణలో భాగంగా పిచ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. లండన్ సమీపంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి, పేసర్లకు అనుకూలంగా ఉండే పిచ్ అవసరమని క్యూరేటర్‌ను కోరాడు. ఫ్లాట్ ట్రాక్‌లు కాకుండా సమతుల్యమైన పిచ్ కావాలని సూచించిన గంభీర్, బౌలర్లకు సహాయపడే పరిస్థితుల్లో ప్రాక్టీస్ అవసరం అన్నది స్పష్టం చేశాడు. ఈ చర్యలు భారత టెస్ట్ జట్టులో కొత్త శకం ప్రారంభానికి నిదర్శనమని భావించవచ్చు
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 8:55 am
Cricket in danger: IPL ఫ్రాంచైజీ ప్యాకేజ్ మోజుతో.. అంతర్జాతీయ క్రికెట్‌కు పాతరేస్తున్న 17 ప్లేయర్స్
ఫ్రాంచైజీ లీగ్‌లలో భాగమవ్వాలని కోరుకుంటూ, ప్రముఖ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నారు. పూరన్, క్లాసెన్, బోల్ట్ వంటి ఆటగాళ్లు కేంద్ర ఒప్పందాల నుంచి తప్పుకున్నారు. క్రికెట్ బోర్డుల ఆర్థిక పరిస్థితులు, ఆటగాళ్లకు లభించే అధిక పారితోషికం ఈ మార్పుకు ప్రధాన కారణాలు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు కేజువల్ లేదా స్వతంత్ర ఒప్పందాలు ఎంచుకుంటున్నారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై కొత్త అనుమానాలను తెరపైకి తీసుకొస్తోంది. ఫ్రాంచైజీ లీగ్‌లు ఆటగాళ్లకు ఆదాయాన్నిచ్చే భరోసాగా మారుతున్నాయి.
- Narsimha
- Updated on: Jun 11, 2025
- 8:38 am