భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. 316 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 22, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారిలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రూ.9,000లు, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రూ.8,000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.