West Railway Rrecruitment 2021: భారత రైల్వే సంస్థ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం వరసగా జాబ్ నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తుంది. తాజాగా పశ్చిమ మధ్య రైల్వే విభాగం వారు అర్హులైన అభ్యుర్థుల నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ వంటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అర్హులైన ఆసక్తి కల్గిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మార్చి 30. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://wcr.indianrailways.gov.in/ లో చూడవచ్చు.
విద్యార్దత -వయస్సు:
దరఖాస్తు చేసుకునేవారు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఇంటర్ విద్యార్హత. అంతేకాదు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ170 చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఫీజుకు ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు ఇచ్చారు. వీరు రూ.70 చెల్లిస్తే చాలు.
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 8,
సెక్రెటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)- 5,
ఎలక్ట్రీషియన్- 18,
ఫిట్టర్- 45,
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 28,
పెయింటర్ (జనరల్)- 10,
కార్పెంటర్- 20, ప్లంబర్- 8,
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 2,
టైలర్ (జనరల్)- 5,
మెకానిక్, (డీజిల్)- 7,
మెకానిక్ (ట్రాక్టర్)- 4,
ఆపరేటర్ (అడ్వాన్స్‌డ్ మెషీన్ టూల్)- 5
Also Read: