UPSC Civils Prelims 2025 Results: యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్స్ డైరెక్ట్ లింక్ ఇదే
యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్ 11) రాత్రి విడుదలైనాయి. ప్రిలిమ్స్ పరీక్షకు 2025కు హాజరైన అభ్యర్థులు ఈ కింది యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తాజా ఫలితాలతోపాటు యూపీఎస్సీ IFS ఫలితాలను కూడా కమిషన్ విడుదల చేసింది..

హైదరాబాద్, జూన్ 12: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు బుధవారం (జూన్ 11) రాత్రి విడుదలైనాయి. ప్రిలిమ్స్ పరీక్షకు 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యేటా యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి ప్రిలిమినరీ పరీక్షను దేశవ్యాప్తంగా మే 25న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, IFS 2025 ప్రిలిమ్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీ వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో కమిషన్ అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకాగా.. వారిలో 14,161 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కి అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభకనపరచిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా తుది మెరిట్ జాబితాను యూపీఎస్సీ రూపొందిస్తుంది. ఇక యూపీఎస్సీ మెయిన్స్ 2025 పరీక్షలు మొత్తం 7 పేపర్లకు గానూ ఆగస్టు 22న జరగనున్నాయి. మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ బుధవారం (జూన్ 11) విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా విడుదల చేసింది. సివిల్స్, ఐఎఫ్‌ఎస్.. అర్హుల జాబితాను వేర్వేరుగా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
కాగా ఈ ఏడాది మొత్తం 979 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో బెంచ్ మార్క్ డిసెబిలిటీ కేటగిరీ కింద అభ్యర్థులకు 38 పోస్టులు, దృష్టి లోపం ఉన్నవారికి 12 పోస్టులు, చెవిటి లేదా వినికిడి లోపం ఉన్నవారికి 7 పోస్టులు, లోకోమోటర్ వైకల్యం ఉన్నవారికి 10 పోస్టులు, బహుళ వైకల్యం ఉన్నవారికి 9 పోస్టులను కేటాయించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.