UPSC Civils Interview: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీలు ఇవే.. త్వరలో కాల్ లెటర్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 పోస్టులకు ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫేజ్-2 కింద ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా గతేడాది డిసెంబర్‌లో ఫేజ్-1 జాబితా వెలువడిన సంగతి తెలిసిందే. ఫేజ్ 2 జాబితాలో అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను..
న్యూఢిల్లీ, జనవరి 28: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 పోస్టులకు ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫేజ్-2 కింద ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా గతేడాది డిసెంబర్‌లో ఫేజ్-1 జాబితా వెలువడిన సంగతి తెలిసిందే. ఫేజ్ 2 జాబితాలో అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఇ-సమన్ లెటర్లు త్వరలో వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్ ప్రకటించింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వీటి ఫలితాలు సెంబర్ 8న విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రతీ యేట సివిల్ సర్వీసెస్ పోస్టులకు యూపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తు్న్న సంగతి తెలిసిందే.
TS MHSRB Staff Nurse Results 2024: తెలంగాణ స్టాఫ్‌నర్సు పోస్టుల తుది జాబితా విడుదల
తెలంగాణ స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. వైద్య, ఆరోగ్యశాఖలో మొత్తం తొమ్మిది విభాగాల్లో 6,956 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు స్టాఫ్‌నర్సుల మెరిట్ జాబితాను రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి దాదాపు 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరందరికీ గత ఏడాది ఆగస్టు 2న రాతపరీక్ష నిర్వహించారు. రిజర్వేషన్, జోన్లవారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలతోపాటు, కటాఫ్ ర్యాంకులు, మార్కుల వివరాలను కూడా బోర్డు వెల్లడించింది.
జనవరి 31న స్టాఫ్‌నర్స్‌లకు నియామక పత్రాలు అందజేత
కొత్తగా ఎంపికైన స్టాఫ్‌నర్స్‌లకు జవవరి 31న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఆదివారం అధికారులు సమావేశమయ్యారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, నగర పోలీస్ జాయింట్ కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్‌తోపాటు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.