UPSC Topper Shruti Sharma: తన సక్సెస్ సీక్రేట్‌ ఇదే.. సివిల్స్‌ టాపర్‌ శృతి శర్మ చెప్పిన విజయ రహస్యం!

|

May 31, 2022 | 9:12 PM

యూపీఎస్సీ సివిల్స్‌ 2021 ఫలితాలు సోమవారం (మే 30) విడుదలయ్యాయి. తాజా ఫిలితాల్లో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించిన శృతి శర్మ (Shruti Sharma) సివిల్స్‌ టాపర్‌గా విజమభేరి మోగించింది. విజయపథం ఏ విధంగా సాగిందో, తాను ఏ సర్వీస్‌ను ఎంచుకోవాలనుకుంటుందో ఆమె మాటల్లోనే..

UPSC Topper Shruti Sharma: తన సక్సెస్ సీక్రేట్‌ ఇదే.. సివిల్స్‌ టాపర్‌ శృతి శర్మ చెప్పిన విజయ రహస్యం!
Upsc Topper Shruti Sharma
Follow us on

Know All About Upsc Topper Shruti Sharma: యూపీఎస్సీ సివిల్స్‌ 2021 ఫలితాలు సోమవారం (మే 30) విడుదలయ్యాయి. తాజా ఫిలితాల్లో శృతి శర్మ (Shruti Sharma) సివిల్స్‌ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించి టాపర్‌గా విజమభేరి మోగించింది. ఆ తర్వాత స్థానాల్లో అంకితా అగర్వాల్‌ (2nd rank), గమినీ సింగ్లా (3rd rank), ఐశ్వర్య వర్మ (4th rank) సాధించారు. మొదటి నాలుగు స్థానాల్లో మహిళలు సత్తా చాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా మొత్తం 684 మంది అభ్యర్ధులు ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ఇతర సర్వీసులకు అర్హత సాధించారు. తొలి 25మంది టాపర్లలో 15మంది పురుషులు కాగా.. 10మంది మహిళలు ఉన్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ క్రమంలో టాపర్‌ శృతి శర్మ విజయపథం ఏ విధంగా సాగిందో, తాను ఏ సర్వీస్‌ను ఎంచుకోవాలనుకుంటుందో, కుటుంబ నేపథ్యమేమిటో ఆమె మాటల్లోనే..

సివిల్స్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ శృతి శర్మ.. ఫస్ట్‌ రియాక్షన్‌..!
”నా పేరు టాప్‌ 1లో ఉందంటే మొదట నమ్మలేకపోయాను.. రిజల్ట్స్‌ని ఒకటికి రెండు సార్లు చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాకగానీ పూర్తి నమ్మకం కుదిరింది.. సివిల్స్‌లో అర్హత సాధిస్తానని అనుకున్నాను గానీ టాపర్‌గా నిలవడం నిజంగా సర్‌ప్రైజింగ్‌గా ఉంది’ అని తన ఫస్ట్‌ రియాక్షన్‌ని మీడియాతో పంచుకుంది. ఈ ప్రయాణంలో సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులందరికీ ఈ క్రెడిట్‌ దక్కుతుందని, వారి వల్లనే ఈ విజయం సాధించగలిగాను. ఐఏఎస్‌ సర్వీస్‌ను ఎంచుకోవాలనుకుంటున్నట్లు” మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

Shruti Sharma

హిస్టరీ స్పెషలైజేషన్‌తో..
ఉత్తర ప్రదేశ్‌లోని జిబ్‌నోర్‌లో పుట్టిన శృతిశర్మ 26 ఏళ్లకే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను (UPSC CSE 2021 topper) క్రాక్‌ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌లో హిస్టరీ (ఆనర్స్‌) స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అయినా.. తర్వాత  కోర్సునుంచి డిస్‌ కంటిన్యూ అయ్యింది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీజీ కంప్లీట్‌ చేసింది. ఆ తర్వాత జామియా మిల్లీయా ఇస్లామియా రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీలో సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకుంది. సివిల్‌ సర్వీస్ పరీక్షల్లో హిస్టరీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎన్నుకుని ప్రిపేరయ్యింది శృతిశర్మ. నాలుగేళ్ల పాటు సివిల్స్‌ కోసం కఠోర శ్రమ, ఎంతో ఆత్మవిశ్వాసంతో చదివి టాపర్‌గా నిలిచి అద్భుతం సృష్టించింది.

నా సక్సెస్‌ సూత్రం అదే..
‘చాలా మంది పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటారు. కానీ శృతి దీనికి పూర్తి భిన్నమైన పద్ధతిని ఆచరించానంటోంది. ‘నిర్విరామంగా చదువుకున్న తర్వాత కొంత విరామం తీసుకోవాలి. వాకింగ్‌ చేయడం, సినిమాలను చూడటం ద్వారా నన్ను నేను రిఫ్రెష్‌ చేసుకుంటాను. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడతాను. సాహిత్యంపై నాకు చాలా ఆసక్తి ఎక్కువ. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా మంచి మంచి నవలలు చదువుతూనే ఉంటాను’.

Civils Topper

మానాన్నకు ఫోన్లో చెప్పగానే..
ఈరోజు సివిల్ సర్వీసెస్ ఫలితాలు చూసి చాలా సంతోషించాను. నాకు టాప్‌ ర్యాంక్‌ వచ్చిందని మా నాన్నకు ఫోన్‌లో చెప్పినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యారు. నా జీవితంలో ఇది మరపురాని క్షణమని, ఈ విజయాన్ని కుటుంబం, స్నేహితులతో జరుపుకుంటానని తన సంతోషాన్ని పంచుకుంది.

ప్రధాని మోదీ అభినందనలు
సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష 2021లో ఉత్తీర్ణులైన వారందరికీ ప్రధాని మోదీ ట్వీటర్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో అడ్మినిస్ట్రేటివ్‌ కెరీర్‌ను ప్రారంభించిన యంగ్‌స్టర్స్‌ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.

 

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.