Office late rule: గుర్తు తెలియని కంపెనీకి సంబంధించిన ఓ షాకింగ్ సర్క్యూలర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు నోటీసులో ఏముందంటే.. ‘ఆఫీస్‌కు ఆలస్యంగా వస్తే ప్రతి నిముషానికి 10 నిముషాల చొప్పున అదనంగా వర్క్ చేయవల్సి ఉంటుంది. ఆఫీస్‌కు వచ్చిన వెంటనే ఆఫీస్ బులెటన్ బోర్డులో కొత్త ఆఫీస్ రూల్స్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను చదవవచ్చు..’ అనేది సారాంశం. అంటే ఉదయం 10 గంటల తర్వాత 2 నిముషాలు (2 నిముషాలు ఆలస్యానికి) ఆలస్యంగా వస్తే.. సాయంత్రం 6 గంటల తర్వాత (ఆలస్యంగా వచ్చినందుకు) నిముషానికి 10 నిముషాలు చొప్పున మొత్తం 20 నిముషాలు అదనంగా వర్క్ చేయాలన్నమాట. అభిషేక్ అస్థానా అనే యూజర్ దీనిని ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఐతే ఏ కంపెనీకి సంబంధించినది అనే విషయం మత్రం తెలియరాలేదు.
న్యూ ఆఫీస్ రూల్స్ పేరిట వెలువడిన ఈ నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో జోకులు పేలుస్తున్నారు. కొన్ని కంపెనీ యాజమన్యాలు పని రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కానీ ఈ విధమైన విష పూరితనిర్ణయాలు అనతికాలంలోనే కంసెనీ నాశనానికి దారితీస్తాయని ఒకరు, ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడంవల్లనే దేశ కంపెనీల్లో అట్రిషన్ (వలసలు) రేటు అమాంతంగా పెరుగుతుందని మరొకరు, ఉద్యోగుల పట్ల భారత కంపెనీల ప్రవర్తన ఏవిధంగా ఉందో ఈ నోటీసు తెల్పుతుందని ఇంకొకరు కామెంట్ల రూపంలో స్పందించారు. ఇంకొందరేమో కంపెనీ ఉద్యోగుల్లో క్రమశిక్షణ రావాలంటే ఈ మాత్రం డోసు ఉండాల్సిందేనంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ విధమైన రూల్స్ మీరు పనిచేస్తున్న కంపెనీలో పెడితే మీరెలా ఫీల్ అవుతారో కింద కామెంట్ల రూపంలో తెల్పండి..
Some business owners are monsters. Seeking profits is good, but such distrust ruins companies in the long run. pic.twitter.com/698CFppyuA
— Gabbbar (@GabbbarSingh) June 12, 2022
కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఆఫీస్ పాలసీని విషపూరితం అని మరియు భారతీయ కంపెనీలలో అధిక అట్రిషన్ రేటుకు కారణమని పేర్కొన్నారు.
Some business owners are monsters. Seeking profits is good, but such distrust ruins companies in the long run. pic.twitter.com/698CFppyuA
— Gabbbar (@GabbbarSingh) June 12, 2022
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.