AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఆఫ్‌లైన్‌ ఎగ్జామ్స్ అంటూ నెట్టింట ప్రచారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన UGC

దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఆఫ్‌లైన్‌ పరీక్షలు (offline  examinations) నిర్వహిస్తాయని తెల్పుతూ యూజీసీ సర్క్యులర్‌ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు సర్క్యులర్‌ ఫేక్‌..

Fact Check: ఆఫ్‌లైన్‌ ఎగ్జామ్స్ అంటూ నెట్టింట ప్రచారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన UGC
Ugc Fake News
Srilakshmi C
|

Updated on: Feb 07, 2022 | 4:11 PM

Share

UGC news : దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఆఫ్‌లైన్‌ పరీక్షలు (offline  examinations) నిర్వహించనున్నట్లు యూజీసీ సర్క్యులర్‌ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు సర్క్యులర్‌ ఫేక్‌ అని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC ) ఆదివారం (ఫిబ్రవరి 6) స్పష్టం చేసింది. ఈ నకిలీ నోటీసుకు సంబంధించి యూజీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది.’ఈ పబ్లిక్ నోటీసు ఫేక్! యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ అటువంటి నోటీసు ఏదీ జారీ చేయలేదు’ అని కమిషన్ ఫిబ్రవరి 6న ట్వీట్ చేసింది. సదరు ఫేక్‌ సర్క్యులర్‌ ప్రకారం.. ‘అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ వారి వారి (home centres) కేంద్రాలలో భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని’ నకిలీ నోటీసు తెల్పుతోంది. దీని ప్రకారం అన్ని యూనివర్సిటీలు కోవిడ్‌ ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ సెమిస్టర్ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించాలని యూజీసీ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో కమిషన్ అటువంటి మార్గదర్శకాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ..తాజాగా ట్వీట్ చేసింది.

కాగా గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఈరోజు నుండి అంటే ఫిబ్రవరి 7, 2022 నుండి అన్ని విభాగాల్లో ఆఫ్‌లైన్ తరగతులు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి అన్ని విద్యా, బోధన, అభ్యాస కార్యకలాపాలు, అలాగే లైబ్రరీ సర్వీసెస్ ఆఫ్‌లైన్‌లో పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం నేటి నుంచి కొనసాగుతున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి.

యూజీసీ ట్వీట్..

Also Read:

MTech Jobs 2022: ఎమ్మెస్సీ/ఎంటెక్‌ అర్హతతో నెలకు రూ.1,30,000లు సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి!