TSRJC CET 2021: విద్యార్థులూ బీ అలర్ట్.. టీఎస్ఆర్‌జేసీ సెట్‌-2021 ఫలితాల విడుదల..

TSRJC CET 2021: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఆర్‌జేసీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు,...

TSRJC CET 2021: విద్యార్థులూ బీ అలర్ట్.. టీఎస్ఆర్‌జేసీ సెట్‌-2021 ఫలితాల విడుదల..
Results

Updated on: Jun 24, 2021 | 10:33 AM

TSRJC CET 2021: తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఆర్‌జేసీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు, అడ్మిషన్‌కు సంబంధించిన సమాచారం కోసం www.tswreis.in, www.tswreis.ac.in వెబ్‌సైట్లను చూడాలని సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ లోపు కేటాయించిన కాలేజీల్లో తమ తమ సర్టిఫికెట్లను సమర్పించాలని పేర్కొన్నారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే.

అయితే, టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పదవ తరగతిలో సాధించిన గ్రేడ్ల ఆధారంగా సీట్ల కేటాయింపులు చేసినట్లు సంబంధిత ప్రకటనలో అధికారులు వెల్లడించారు. గ్రేడ్ల ఆధారంగానే జిల్లాల వారీగా విద్యార్థుల్ని ఇంటర్ మొదటి సంవత్సరానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షను జులై 18వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ నందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని, విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

Also read:

Crime News: ”ఒక్క రూపాయి ఇస్తే రూ.కోటి ఇస్తా”.. ఆన్‌లైన్‌లో మార్కెట్‌లో టీచర్‌కు కుచ్చు టోపీ.!