Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధం! పూర్తి వివరాలివే..
TSPSC Group 1 Notification 2022: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే.
TSPSC Group 1 Notification 2022: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో ఉండే ఖాళీలను బేరీజు వేసుకుని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక గ్రూప్-1 పోస్టుల తొలి నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటన వచ్చే అవకాశముంది. శనివారం ఇదే విషయమై టీఎస్‌పీఎఎస్సీ (TSPSC) కీలక సమావేశం జరిగింది. మొత్తం19 ప్రభుత్వ శాఖల్లోని 503 ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదనలన్నింటినీ నిశీతంగా పరిశీలించి ఆమోదం తెలిపారట. ఆయా పోస్టుల విద్యార్హత, వయసు తదితర అంశాలు సక్రమంగానే ఉన్నప్పటికీ మరో మూడు అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉందట. వీటిపై సోమవారం లేదా మంగళవారం ఉత్తర్వులొస్తాయని, రాగానే నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి నోటిఫికేషన్..
కాగా గతంలో గ్రూపు-1 కేటగిరీలో లేని విభాగాల పోస్టులను ఈసారి దీని పరిధిలోకి చేర్చారు. అదేవిధంగా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీజోనల్ స్థాయికి మారాయి. ఇక ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రూపు-1 పరీక్ష విధానంలో మార్పులు జరిగాయి. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈక్రమంలో దరఖాస్తుల స్వీకరణకు ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి, ప్రిలిమినరీ పరీక్షలు ఎప్పుడు జరపాలి వంటి అంశాలపై ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఒక తాత్కాలిక టైంటేబుల్‌ను రెడీ చేసుకుంది. కాగా ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత తొలి గ్రూపు-1 నోటిఫికేషన్ అత్యధిక పోస్టులతో వెలువడనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు కూడా పెరగడంతో ఏకంగా 503 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఇంటర్వ్యూలు కూడా ఎత్తివేసినందున వీలైనంత త్వరగా ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పూర్తిచేసి పోస్టింగ్‌లు కేటాయించాలని కమిషన్ భావిస్తోంది.
Also Read:
వీడెవడండీ బాబు !! ఏకంగా కారును హెలికాఫ్టర్ గ మార్చేశాడు !! మీరు ఓ లుక్ వేయండి