AP Summer Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..
AP Summer Holidays: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వేసవి సెలవులను ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను..
AP Summer Holidays: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వేసవి సెలవులను ప్రకటించింది. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం (Government) తెలిపింది. మే 4వ తేదీ లోగా అన్ని పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలను ఆదేశించింది. ఇక జూలై 4వ తేదీన పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో విద్యా సంవత్సరంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రెండేళ్లుగా సిలబస్ తగ్గింపులు, సెలవుల కుదింపుతో పాటు విద్యా సంవత్సరాన్ని ముందుకు జరుపుతున్నారు. టెన్త్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారు. అయితే ఈనెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉండగా, అది కాస్తా మే 6 వరకు పొడిగించాల్సి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: