AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 2 Exam: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా.. త్వరలోనే అధికారికంగా ప్రకటన

తెలంగాణ డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షల వివాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. వివాదాల నడుమ డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమైనప్పటికీ.. సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వనందున పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. మరోవైపు డీఎస్సీ పరీక్షకు, గ్రూప్‌ 2కి మధ్య వారం వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో..

TGPSC Group 2 Exam: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా.. త్వరలోనే అధికారికంగా ప్రకటన
TGPSC Group 2 Exam
Srilakshmi C
|

Updated on: Jul 19, 2024 | 6:21 AM

Share

హైదరాబాద్, జులై 19: తెలంగాణ డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షల వివాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది. వివాదాల నడుమ డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమైనప్పటికీ.. సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వనందున పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. మరోవైపు డీఎస్సీ పరీక్షకు, గ్రూప్‌ 2కి మధ్య వారం వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్‌ 2 వాయిదా వేసేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు నిరుద్యోగులకు తాజాగా హామీ ఇచ్చారు. గురువారం (జులై 18) బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో సమావేశమైన వీరు.. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు తమ గోడును వెల్లడించారు. డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని వాపోయారు.

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ప్రకారం డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షలను మే, జూన్‌లో నిర్వహించాల్సి ఉంది. అభ్యర్థుల డిమాండ్‌ మేరకు డీఎస్సీ కంటే ముందు టెట్‌ నిర్వహించామన్నారు. అప్పటికే టీజీపీఎస్సీ పరీక్షలకు తేదీలు జారీ అయ్యాయని, అందువల్లనే డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయని ఎంపీ చామల వివరించారు. ఈ విషయంలో నిరుద్యోగులది న్యాయమైన డిమాండేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గ్రూప్‌ 2 వాయిదా వేసేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల సమయంలో చెప్పనిట్లుగానే యేటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీజీపీఎస్సీ గత ఏడాది గ్రూప్‌ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్‌ 2 వాయిదా పడింది. తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ల హామీ మేరకు మరోమారు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. పరీక్షలు వాయిదా పడినా.. నిరుద్యోగులు కోరుతున్నట్లు పోస్టులు సంఖ్య పెరుగుతుందో.. లేదో మాత్రం సర్కార్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..