TSPSC Group 1 Prelims 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు.. ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష?

|

Feb 27, 2024 | 10:23 AM

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి కార్యచరణ ప్రారంభమైంది. పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 563 పోస్టులతో ఫిబ్రవరి 19న కొత్తగా గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ఖరారుచేసింది. జూన్‌ 9న ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించింది..

TSPSC Group 1 Prelims 2024: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు.. ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష?
TSPSC Group 1 Prelims
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి కార్యచరణ ప్రారంభమైంది. పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 563 పోస్టులతో ఫిబ్రవరి 19న కొత్తగా గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ఖరారుచేసింది. జూన్‌ 9న ప్రిలిమ్స్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ సోమవారం (ఫిబ్రవరి 26) ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో అభ్యర్ధులు మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రిలిమ్స్‌ పరీక్షను మే లేదా జూన్‌ నెలల్లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే గ్రూప్‌ 1తో సహా ఇతర పరీక్షల తేదీలపై చర్చించి ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ఖరారుచేసింది. తాజా ప్రకటన ప్రకారం జూన్‌ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రశ్నపత్రంలో మొత్తం 150 ప్రశ్నలుంటాయని, నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుందని తెలిపారు. పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎమ్మార్‌ పద్ధతిలోనే నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత వారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్‌ పరీక్షను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో ఓఎమ్మార్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే 33 జిల్లాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే పాత ఉమ్మడి పది జిల్లాల్లో మాత్రమే పరీక్షాకేంద్రాలను కేటాయిస్తామని వెల్లడించింది. దీనిపై ఇంకా స్పష్టత రానప్పటికీ తాజాగా స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో మాత్రం అభ్యర్థులు ఆఫ్‌లైన్‌కు, ఆన్‌లైన్‌కు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే జిల్లాలను ఎంచుకునే అవకాశం ఇచ్చింది.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల దరఖాస్తు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ఒకేరోజు ఇంతమందికి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం సాధ్యంకాదని నిపుణులు అంటున్నారు. అయితే ఒకేరోజు పరీక్ష నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంటున్న నేపథ్యంలో.. పరీక్ష ఓఎమ్మార్‌ పద్ధతిలోనే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.