హైదరాబాద్, జులై 23: టీఎస్పీయస్సీ జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీని కమిషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 తుది ఆన్సర్ కీ ఈ వారంలో వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు పూర్తిచేసింది. త్వరలో తుది కీ కూడా విడుదల చేయనుంది. అనంతరం వచ్చేనెలలో ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. కాగా గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2.33 లక్షల మందికి పైగా హాజరయ్యరు.
పరీక్షకు హాజరైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ విధానంలో సేకరించిన అభ్యంతరాల ఆధారంగా రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను కమిషన్ ప్రకటిస్తుంది. కాగా మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే జులై 1న నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ కూడా దాదాపు పూర్తయింది. ప్రిలిమినరీ కీతో పాటు ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ఇమేజ్‌లను త్వరలో కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచనుంది.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.