TS Police Jobs: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తగ్గిన పోటీ.. ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు ఖాయం!

|

Jan 08, 2023 | 8:56 PM

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్ధులు పోటాపోటీగా సిద్ధపడుతున్నారు. స్క్రీనింగ్‌ టెస్ట్, ఈవెంట్స్‌ తర్వాత ప్రస్తుతం పోటీలో ఉన్న..

TS Police Jobs: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు తగ్గిన పోటీ.. ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు ఖాయం!
TSLPRB Mains Written Exam
Follow us on

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మెయిన్స్‌ పరీక్షకు అభ్యర్ధులు పోటాపోటీగా సిద్ధపడుతున్నారు. స్క్రీనింగ్‌ టెస్ట్, ఈవెంట్స్‌ తర్వాత ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం కనిపిస్తోంది. వడబోత అనంతరం పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో నూతనోత్సాహం నెలకొంది. మొత్తం 16,969 కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రస్తుతం మెయిన్స్‌ రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. ఈక్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది పోటీ పడనున్నారు. అటు సివిల్‌ విభాగంలోనైతే 15,644 పోస్టులులకు కేవలం 90,488 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఈలెక్కన ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉంది.

నిజానికి 16,969 కానిస్టేబుల్‌ పోస్టులకు మొత్తం 9,54,064ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల అనంతరం 1,75,657 మంది మాత్రమే మిగిలారు. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది, మెకానిక్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 56 మంది, డ్రైవర్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 65 మంది, రవాణా విభాగంలో ఒక్కో పోస్టుకు 143 మంది, ఎక్సైజ్‌శాఖలో ఒక్కో పోస్టుకు 97 మంది, అగ్నిమాపకశాఖ ఆపరేటర్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 12 మంది పోటీలో ఉన్నారు.

ఎస్సై కొలువులకు అన్ని విభాగాల్లో కలిపి 587 పోస్టులు ఉండగా వీటి కోసం 2,47,630ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వడబోత అనంతరం 59,574 మంది మిగిలారు. ఇక ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీ పడుతున్నారు. మెయిన్స్‌ రాతపరీక్ష అనంతరం రిజర్వేషన్‌ వారీగా కటాఫ్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.