TS GENCO Application Deadline: తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

|

Oct 24, 2023 | 1:36 PM

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 399 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 29, 2023వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగియనుంది. అయితే తాజాగా జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ తుది..

TS GENCO Application Deadline: తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
TSGENCO
Follow us on

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 399 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. తొలుత ఇచ్చిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 29, 2023వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగియనుంది. అయితే తాజాగా జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ తుది గడువును పొడిగిస్తూ యాజమాన్యం ఓ ప్రకటన వెలువరించింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే నవంబర్‌ 14, 15 తేదీల్లో సరిదిద్దుకోవచ్చని తెల్పింది. డిసెంబర్‌ 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించనుంది.

కాగా రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల నిమిత్తం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఇప్పటికే సంస్థ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంట్రోల్ ఇంజినీరింగ్/పవర్ ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ పవర్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయసు జులై 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్‌ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.400 చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.