TS TET 2022: సులువుగా తెలంగాణ టెట్‌ పరీక్ష-2022.. రికార్డుస్థాయిలో ఉత్తీర్ణతకు అవకాశం!

|

Jun 14, 2022 | 10:37 AM

ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల నుంచే ఇచ్చారని, రెండు పేపర్లూ చాలా సులభంగా ఉన్నాయని తెలంగాణ టెట్ అభ్యర్థులు..

TS TET 2022: సులువుగా తెలంగాణ టెట్‌ పరీక్ష-2022.. రికార్డుస్థాయిలో ఉత్తీర్ణతకు అవకాశం!
Ts Tet 2022
Follow us on

Telangana TET 2022 result date: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో జూన్‌ 12న నిర్వహించిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022) ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్లకు కలిపి 90 శాతం మందికిపైగా అభ్యర్ధులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోలేదని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలన్నీ పాఠ్యపుస్తకాల నుంచే ఇచ్చారని, రెండు పేపర్లూ చాలా సులభంగా ఉన్నాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. తెలంగాణ సంస్కృతి, బోనాలు, గ్రామీణ ఆటలు, ప్రభుత్వ పథకాలపైనా ప్రశ్నలు వచ్చాయి. సైకాలజీ, బోధనా నైపుణ్యాలపై ప్రశ్నలు కాస్త మెదడుకు పదునుపెట్టేలా ఉన్నాయని పరీక్షకు హాజరయిన అభ్యర్థులు అంటున్నారు. రెండు పేపర్లూ సులభంగా ఉండటంతో ఈసారి టెట్‌లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత పరీక్షలతో పోలిస్తే ఈసారి టెట్‌ క్వశ్యన్ పేపర్‌ సులువుగా ఉండటంతో ఈమేరకు అంచనాలు నెలకొన్నాయి. ఇన్‌డైరెక్ట్‌ క్వశ్చన్స్‌ అంటే ప్రశ్నను చదివిన వెంటనే సమాధానాలు తెలుసుకునేలా కాకుండా, ఆలోచించి రాసేలా ప్రశ్నలున్నాయని అభ్యర్థులు అంటున్నారు. ఈ ఏడాది బీఎడ్‌ చేసినవారికి కూడా పేపర్‌-1 పరీక్ష రాసే అవకాశం ఇవ్వడంతో ఆ పేపర్‌కు ఎక్కువమంది హాజరయ్యారు. గతంలో ఈ పేపర్‌కు గరిష్ఠంగా 50,000ల నుంచి 60,000ల మంది హాజరవగా, ఈసారి ఏకంగా 3,18,506 మంది పేపర్ 1 పరీక్ష రాశారు. ఇక రెండో పేపర్‌కు 2,77,900ల మంది దరఖాస్తు చేసుకోగా 2,51,050ల మంది పరీక్ష రాశారు. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి పేపర్‌1 ప్రశ్నల సరళి కూడా భిన్నంగా ఉందన్నారు. కాగా టెట్‌ అఫిషియల్‌ ఆన్సర్‌ ‘కీ’ త్వరలో విడుదలకానుంది. తుది ఫలితాలు జూన్‌ 27న విడుదల చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.