TS PGECET 2022 application last date: 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించనున్న తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET)కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి (TSCHE) సోమవారం (జులై 4) ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జులై 10 వరకు పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ pgcet.tsche.ac.in.లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1000లు చెల్లించవల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు జులై 20 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీసెట్ 2022 ప్రవేశ పరీక్షలు జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఇతర పూర్త సమాచారం కోసం https://pgecet.tsche.ac.in/UI/ImportantDates.aspxలో చెక్ చేసుకోవచ్చు.
పీజీఈసెట్ 2022లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఎమ్‌ఈ/ఎంటెక్/ఎంఫార్మసీ/ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.