TS Nurse Exam Results 2023: తెలంగాణ స్టాఫ్‌ నర్సు పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి

|

Dec 19, 2023 | 1:09 PM

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల ఫలితాలు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) విడుదల చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సోమవారం (డిసెంబరు 18) ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 7,094 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 30న ప్రకటన వెలువడిన సంగతి..

TS Nurse Exam Results 2023: తెలంగాణ స్టాఫ్‌ నర్సు పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి
TS Nurse Exam Results 2023
Follow us on

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల ఫలితాలు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) విడుదల చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సోమవారం (డిసెంబరు 18) ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 7,094 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 30న ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్కులపై అభ్యంతరాలున్న అభ్యర్థులు డిసెంబరు 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు తెలియజేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌ సెలక్షన్‌ విధానంలో ప్రభుత్వ వైద్య సేవలో అనుభవం ఉన్నవారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించారు. మార్కులతో పాటు రిజర్వేషన్ల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌ ఉద్యోగ నియామకాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్‌ 20వ తేదీన పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన దాదాపు 677 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై అభ్యర్ధులకు ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంటీఎస్‌ పోస్టులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.